Ads
దేశం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా.. సామాన్యులకు తీరని అవసరాలు దేశాన్ని వెనక్కి నెట్టుతూనే ఉన్నాయి. ఇటీవల ఛతార్ పూర్ జిల్లాలో చోటు చేసుకున్న ఓ ఘటన నెట్టింట్లో కంటతడి పెట్టిస్తోంది. ఓ తండ్రి తన నాలుగేళ్ళ కుమారుడు చనిపోతే.. మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్ళడానికి పడిన అవస్థ అందరిని విషాదంలో ముంచెత్తుతోంది.
Video Advertisement
ఛతార్ పూర్ జిల్లా పౌడి గ్రామానికి చెందిన ఓ నాలుగేళ్ళ బాలుడు ఉన్నట్లుండి అస్వస్థతకు గురి అవ్వడంతో అతని కుటుంబ సభ్యులు బుక్స్ వాహా హెల్త్ సెంటర్ కు తీసుకుని వెళ్లారు. అయితే.. ఆ బాలుడి పరిస్థితి మరింత విషమించింది.
దీనితో ఆ బాలుడిని దామోహ్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కాగా.. మంగళవారం నాడు ఆ బాలుడు మృతి చెందాడు. అయితే.. తన బిడ్డ మృతదేహాన్ని ఊరికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ ఏర్పాటు చేయాలనీ ఆసుపత్రి సిబ్బందిని కోరినా ఫలితం లేకపోయింది. దీనితో ఆ తండ్రి బిడ్డని భుజాన వేసుకుని, దుప్పటి కప్పి ఆ బాబుని పడుకోపెట్టినట్లుగా పెట్టి బస్సులోనే బుక్స్ వాహాకు చేరుకున్నాడు.
అక్కడ నుంచి తన గ్రామానికి ఏదైనా వాహనం ఏర్పాటు చేయాలనీ బుక్స్ వాహాలో స్థానిక అధికారులను కోరాడు. అయితే వారు కూడా సరిగా స్పందించలేదు. ఇక చేసేది లేక ఆ బిడ్డ శవాన్ని తన భుజాలపై వేసుకుని.. కాలినడకన ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాడు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియో నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆ తండ్రి బాధని అర్ధం చేసుకున్న కొందరు స్థానికులు సాయం చేసి ఆ బాలుడిని ఇంటికి పంపించడానికి ఏర్పాట్లు చేసారు. శవాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి ఒక్క అధికారి కూడా సాయం చేయలేదని.. ఎంతమంది ఆసుపత్రి సిబ్బందికి తమ గోడు చెప్పుకున్నా పట్టించుకోలేదని ఆ బాలుడి తాత మన్సుఖ్ అహిర్వార్ ఆరోపించారు. అయితే.. డాక్టర్ మమతా తిమోరి మాత్రం తమ వద్దకు ఇలా ఎవరూ రాలేదని పేర్కొన్నారు.
End of Article