బ్రష్ చేయకుండా కిస్ చేయద్దు అని భార్య అన్నందుకు ఈ భర్త ఎంత పని చేసాడో చూడండి!

బ్రష్ చేయకుండా కిస్ చేయద్దు అని భార్య అన్నందుకు ఈ భర్త ఎంత పని చేసాడో చూడండి!

by Anudeep

Ads

ఇటీవల కాలంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం ఇటీవల కొందరికి పరిపాటి అయిపోతోంది. కొన్ని సార్లు ఇది ప్రాణాలు తీసేవరకు వెళ్తోంది. తాజాగా.. ఇటువంటి ఘటనే కేరళలోని పాలక్కడ్ జిల్లాలో చోటు చేసుకుంది.

Video Advertisement

బ్రష్ చేసుకోకుండా ఓ వ్యక్తి తన కొడుక్కి ముద్దు పెట్టుకోబోయాడు. అయితే.. అతని భార్య వద్దని వారించింది. దీనితో సదరు భర్త ఆగ్రహంతో ఆమెని హత్య చేసాడు. కేరళలోని పాలక్కడ్ లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.

palakkad 1

వివాహబంధంతో ఒక్కటైన జంట పిల్లలు పుట్టిన తరువాత వారి మధ్య అనుబంధాన్ని మరింత పెంచుకుంటారు. అయితే.. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటె వారి జీవితం సజావుగా సాగిపోతుంది. వేరు వేరు పరిస్థితుల మధ్య పెరిగిన ఇద్దరు వ్యక్తులు ఒకచోట ఇమడాలంటే చిన్న చిన్న సర్దుబాట్లు తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ప్రతి చిన్నదానికి గొడవలు జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి ఈ గొడవలు ఆత్మహత్యలు, హత్యల వరకూ తీసుకెళ్తుంటాయి.

palakkad 2

తమిళనాడుకు చెందిన దీపికా, అవినాష్ దంపతులు కేరళ పాలక్కాడ్ లోని కరాకురుస్సి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వీరికి ఏడాదిన్నర వయసు ఉన్న బాబు ఉన్నాడు. అయితే అవినాష్ ఉదయాన్నే బ్రష్ చేసుకోకుండా కొడుకుని ముద్దు పెట్టుకోబోయాడు. దీనితో దీపిక అడ్డుకుంది. అయితే.. ఈ విషయంలో ఇద్దరు గొడవ పడ్డారు. ఈ క్రమంలో కోపం పెంచుకున్న అవినాష్ దీపికపై కత్తితో దాడి చేసాడు. దీనితో ఆమె తల, మెడ వద్ద తీవ్రంగా గాయాలు అయ్యాయి. దీపికను ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడ నుంచి మరో ఆసుపత్రికి తరలించాలని ప్రయత్నించారు. ఆలోపే ఆమె మరణించింది.

wife and husband 2

అవినాష్ ఎయిర్ ఫోర్స్ సివిల్ కాంట్రాక్టు కంపెనీలో అసిస్టెంట్ సూపర్ వైజర్ గా పని చేస్తున్నారు. రెండు నెలల క్రితమే ఆయన కుటుంబంతో కలిసి పాలక్కాడ్ కు వచ్చారని తెలుస్తోంది. అవినాష్ కు దీపిక రెండవ భార్య. ఒడిశాకు చెందిన అమ్మాయికి మొదటగా అవినాష్ విడాకులు ఇచ్చేసారు. తరువాత 2019 వ సంవత్సరంలో దీపికను వివాహం చేసుకున్నారు.


End of Article

You may also like