Ads
ఇటీవల హింసాత్మక ఘటనలు ఎక్కువ గా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్ లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అన్నా వదిన అంటూ.. దగ్గరైన ఓ వ్యక్తి మోజులో పడిన భార్య.. తన కన్న కొడుకునే హత్య చేసింది. ఈ ఘటన హైదరాబాద్ లో చింతల్ భగత్ సింగ్ నగర్ లో చోటు చేసుకుంది.
Video Advertisement
వివరాల్లోకి వెళ్తే, సంగారెడ్డి జిల్లా కి చెందిన ఉదయ మరియు జగద్గిరి గుట్ట కు చెందిన సురేష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు కూడా ఉన్నారు. జగద్గిరి గుట్టలోనే వీరు కాపురం ఉంటున్నారు. అయితే.. సురేష్ కు ఓ రోజు భాస్కర్ అనే వ్యక్తి తో పరిచయం అయింది. సురేష్ ను భాస్కర్ తన వద్దే పనిలో పెట్టుకున్నాడు. అయితే.. భాస్కర్ కూడా సురేష్ ను అన్నా అంటూ పిలిచేవాడు. సురేష్ కూడా భాస్కర్ ను తమ్ముడిలా చూసుకునేవాడు.
భాస్కర్ పై బాగా నమ్మకం కుదరడం తో.. సురేష్ ఓ రోజు భాస్కర్ ను తన ఇంటికి తీసుకెళ్లి భార్య కి కూడా పరిచయం చేసాడు. భాస్కర్ కూడా ఉదయను ఒదినా అని పిలుస్తూ కుటుంబం లో ఓ వ్యక్తి లా మెలిగేవాడు. మరో వైపు ఉదయతో కూడా అతి చనువు ప్రదర్శించే వాడు. భర్త, మూడు సంవత్సరాల కొడుకు ఉన్నా కూడా ఉదయ విచక్షణ విడిచి భాస్కర్ కు దగ్గరైంది. ఓ రోజు సురేష్ కూడా వీరు కలిసి ఉండడం చూడడం తో కాపురం లో చిచ్చు రేగింది.
ఉదయ సురేష్ తో గొడవ పడి అక్కడ నుంచి వెళ్ళిపోయి భగత్ సింగ్ నగర్ లో కాపురం పెట్టింది. అక్కడ ఒంటరి గా ఉంటున్న ఉదయ భాస్కర్ తో తన వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. అయితే.. తమ ప్రేమ కు కొడుకు అడ్డం వస్తున్నాడని భావించేది. ఓ రోజు చిన్నారి అన్నం తినను అంటూ గొడవ చేస్తుండడం తో.. ఉదయ ఆ పిల్లాడిని గట్టి గా కొట్టింది. భాస్కర్ కూడా కరెంటు వైర్ తో కొట్టాడు. కాలితో తన్నాడు. ఈ దెబ్బలు తట్టుకోలేక ఆ పిల్లాడు మరణించాడు. స్థానికులు కలగచేసుకుని ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు.
End of Article