ఇటీవల కాలం లో ప్రేమ వివాహాలు ఎక్కువ గా జరుగుతున్న సంగతి తెలిసిందే. చాలా మంది స్కూల్ డేస్ లోనో, కాలేజీ డేస్ లోనో ప్రేమలో పడి.. పెళ్లి చేసుకోవడానికి పెద్దలు ఒప్పుకోక ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కోకొల్లలు గా కనపడుతున్నాయి. ఎంత ట్రూ లవ్ అయినా కూడా.. వివాహం వరకు వచ్చే ప్రేమ జంటలు తక్కువనే చెప్పాలి.

palakkad district case 1

కానీ ఈ ప్రేమ జంట కథ వేరు. వివరాల్లోకి వెళ్తే, కేరళ పాలక్కాడ్‌ జిల్లా కు చెందిన వరవత్తూరులోని మన్నెంకోట్ కాంపౌండ్ కు చెందిన శివరాజన్, కృష్ణ ప్రభ ల ప్రేమ కథ వారి చదువుకునే రోజుల్లోనే మొదలైంది. కష్టపడి పెద్దలను ఒప్పించి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే కృష్ణ ప్రభ ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుంది. ఈ ఘటన స్థానికం గా కలకలం రేపింది.

palakkad district case 2

సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నా.. కృష్ణ ప్రభ ఎటువంటి కట్నం తీసుకురాకపోవడం తో ఆమెకు అత్తింటివారి నుంచి వేధింపులు ఎదురయ్యాయని విచారణలో తేలింది. ఆమె చనిపోవడానికి శివరాజన్, అతని కుటుంబ సభ్యులే కారణమని కృష్ణ ప్రభ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.