రోజులానే డిన్నర్ చేసి పడుకోవడానికి గదిలోకి వెళ్ళింది.. రాత్రి ఉన్నట్లుండి ఏదో కిందపడేసరికి… అసలేమైందంటే?

రోజులానే డిన్నర్ చేసి పడుకోవడానికి గదిలోకి వెళ్ళింది.. రాత్రి ఉన్నట్లుండి ఏదో కిందపడేసరికి… అసలేమైందంటే?

by Anudeep

Ads

కాన్పూర్ పరిధి లోని కళ్యాణ్ పూర్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్స్ గా పనిచేసే రిబుల్ అనే యువతి అనుమానాస్పదం గా మృతిచెందిన ఘటన స్థానికం గా కలకలం రేపింది. రిబుల్ అలియాస్ శివ అనే ఇరవై ఏళ్ల యువతి అర్ధరాత్రి సమయం లో ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని తెలుస్తోంది. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ముందే డైరీ లో తన స్నేహితుడు అమన్ ఫోటో ను వైరల్ చేస్తానంటూ బెదిరిస్తున్నట్లు రాసుకుని ఉంది.

Video Advertisement

ribul 4

వివరాల్లోకి వెళితే, ఎటావా జిల్లాలోని ఉష్రహార్ పోలీస్ స్టేషన్ పరిధి లోకి వచ్చే విష్ణుపూర్ అనే గ్రామం లో రిబుల్ నివాసం ఉంటోంది. రమా డెంటల్ కాలేజీ లో ఏఎన్‌ఎం కోర్స్ ను పూర్తి చేసిన రిబుల్ కేశవపురం లోని ప్రైవేట్ ఆసుపత్రి లో పని చేస్తోంది. హాస్పిటల్ కు సమీపం లోనే ఓ ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉంటూ ఉద్యోగం చేసుకుంటోంది. రోజులానే.. భోజనం చేసాక పడుకోవడానికి తన గదిలోకి వెళ్ళింది. ఆమె పై గదిలో పడుకుంటుంది.

sad incident happened to ribul

అర్ధరాత్రి వేళ ఉన్నట్లుండి పైన గదిలోంచి ఏదో కిందపడిన శబ్దం రావడంతో ఇంటి ఓనర్ హడావిడి గా పైకి వెళ్ళింది. తీరా చూస్తే, రిబుల్ ఫ్యాన్ కు ఉరివేసుకుని వేళ్ళాడుతూ కనిపించింది. ఆమె కంగారులో కేకలేయడం తో ఇరుగు పొరుగు అంతా లేచి వచ్చారు. పోలీసులకు, రిబుల్ ఫ్యామిలీ సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. వారికి అక్కడ ఒక డైరీ కనిపించింది.

sad incident happened to ribul

అందులో ఆమె స్నేహితుడు అమన్ తన ఫోటోలను వైరల్ చేస్తానని బెదిరిస్తున్నాడని రాసుకుంది. ఈ అమన్ ఎవరు..? ఆ ఫోటో ఏంటి ? అనేది పోలీసులు తెలుసుకునే పనిలో పడ్డారు. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ముందు చివరగా ఓ ఫ్రెండ్ తో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆ ఫ్రెండ్ ఎవరో కూడా పోలీసులు తేల్చాల్సి ఉంది. ఆమె ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలియడం తో అమన్ కనిపించకుండా పోయాడు. ప్రస్తుతం పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. పోస్ట్ మార్టం తరువాత పోలీసులు ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.


End of Article

You may also like