Home News మేనమామ తో ఏడడుగులు నడిచిన ఏడవరోజే ఆత్మహత్య చేసుకున్న నవ వధువు..! అసలు ఏమి జరిగిందంటే..?

మేనమామ తో ఏడడుగులు నడిచిన ఏడవరోజే ఆత్మహత్య చేసుకున్న నవ వధువు..! అసలు ఏమి జరిగిందంటే..?

by Anudeep

తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలానికి చెందిన గాదరాడ గ్రామం లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సొంత మేనమామ నే వివాహం చేసుకున్న ఆ యువతి పెళ్ళై కాళ్ళ పారాణి ఆరకుండానే ఆత్మహత్య కు ఒడిగట్టింది. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలియరాలేదు. ఈ విషయమై పోలీసులు విచారణ చేపట్టారు.

wedding east godavari

పోలిసుల కధనం ప్రకారం, తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలానికి చెందిన గాదరాడ గ్రామం లో నివసించే కనుమురెడ్డి అశోక్‌ తో సామర్లకోట మండలం మేడపాడు నివాసి తొండారపు వీరవెంకటలక్ష్మి పెద్ద కూతురు అశ్విని స్వాతి కి ఇచ్చి వివాహం చేయాలనీ పెద్దలు నిశ్చయించుకున్నారు. జూన్ 29 న వీరి వివాహం జరిగింది. రెండు రోజుల క్రితమే వీరు గాదరాడకు వచ్చారు. ఆషాఢమాసం వస్తుండడం చేత, సోమవారం మంచి రోజు చూసుకుని ఆమె ను పుట్టింటికి పంపాలని అనుకున్నారు.

 

ఇంట్లో పెళ్లి సందడి కొనసాగుతూనే ఉంది. ఆమెను పుట్టింటికి పంపడానికి ఇంట్లో కుటుంబ సభ్యులు ఏర్పాట్లలోనే మునిగిపోయి ఉన్నారు. అంతలోనే స్వాతి ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుంది. సభ్యులు చూసేటప్పటికి ఆమె మరణించింది. అశోక్ స్వాతి కి మేనమామ వరస అవుతాడు. అతను తాపీ పని చేస్తూ ఉంటారు. ఇటీవలే కొత్త ఇల్లు కట్టుకుని గృహప్రవేశం కూడా చేసారు. అందరు దగ్గరి బంధువులే అవ్వడం తో ఈ విషయం బయటకు రాకుండా మాట్లాడుకున్నారు.

wedding east godavari 2

 

కానీ, ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించడం తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మృతురాలి తల్లి ఇచ్చిన విచారణ మేరకు ఈ కేసు ను పోలీసులు నమోదు చేసుకున్నారు. స్వాతి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణమేమిటో పోలీసులు విచారణ చేపట్టనున్నారు.

You may also like