Home News 8 నెలలనుంచి ప్రేమించుకుంటున్నారు.. కానీ ఇలా చేశావేంటి ప్రత్యుషా..? తప్పు ఎవరిది..?

8 నెలలనుంచి ప్రేమించుకుంటున్నారు.. కానీ ఇలా చేశావేంటి ప్రత్యుషా..? తప్పు ఎవరిది..?

by Anudeep

ఇటీవల కాలం లో ఆత్మహత్యలు ఎక్కువ గానే జరుగుతున్నాయి. చిన్న చిన్న కలహాలే మనస్పర్థలకు దారితీసి ఆత్మహత్యలు చేసుకునే వరకు వెళ్తున్నాయి. ఇటీవల ప్రేమించిన వ్యక్తి అవాయిడ్ చేస్తున్నాడన్న కారణం తో ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం స్థానికం గా కలకలం రేపింది.

prathyusha incident 1

న్యూస్ 18 కధనం ప్రకారం, సత్తుపల్లి మండలం నారాయణపురానికి చెందిన అలవాల ప్రత్యుష అనే అమ్మాయి హైదరాబాద్ లో ప్రైవేట్ కంపెనీ లో జాబ్ చేస్తోంది. అయితే.. అప్పుడపుడు ఆమె తుంబురు లోని తన అమ్మమ్మగారింటికి వస్తూ ఉండేది. ఈ క్రమం లో అక్కడ జగదీశ్ అనే వ్యక్తి తో ఆమెకు పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమ గా మారింది. జగదీశ్ పెయింటర్ గా పని చేస్తూ ఉండేవాడు.

lovers 2

జగదీశ్ కూడా ప్రత్యుష కోసం చాలా సార్లు హైదరాబాద్ కు కూడా వచ్చాడు. వీరిద్దరూ టూర్ కి కూడా వెళ్లారు. అయితే.. హఠాత్తుగా వీరిద్దరి మధ్య దూరం వచ్చింది. జగదీశ్ ప్రవర్తనలో మార్పు ని ప్రత్యుష గమనించింది. కాల్ చేస్తే బిజీ గా ఉన్నా.. మళ్ళీ చేస్తా అంటూ అవాయిడ్ చేసేవాడు. దాదాపు ఎనిమిది నెలల ప్రేమ తరువాత.. ప్రత్యుష తనను పెళ్లి చేసుకోవాలంటూ జగదీశ్ ను కోరింది.

lovers 3

అయితే.. జగదీశ్ మాత్రం పెళ్లి చేసుకోవడం కుదరదని తేల్చి చెప్పేసాడు. తనకు అలంటి ఉద్దేశ్యం లేదన్నాడు. దీనితో ప్రత్యూష మనస్థాపానికి గురి అయింది. హైదరాబాద్ లో జాబ్ చేస్తూ ఉన్నా.. ఆమె ప్రేమ విషయమై బాధ పడుతూ ఉండేది. ఏప్రిల్ 30 న ఆఫీస్ కి వెళ్లి వచ్చి.. ఇంటికి వచ్చాక శానిటైజర్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెను వెంటనే ఆసుపత్రి లో చేర్పించారు. మే 2 న ఆమె చావు బతుకుల మధ్య పోరాడి ఓడిపోయింది. ఆమె మృతదేహాన్ని తుంబురు కు తీసుకెళ్లి జగదీశ్ ఇంటి ముందు ఆందోళన చేసారు. ప్రత్యుషకు న్యాయం చేస్తామని పోలీసులు సర్దిచెప్పి వారిని అక్కడనుంచి పంపేశారు.

prathyusha incident

ఆమె ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలియగానే జగదీష్ కుటుంబం ఇంటి నుంచి పరారీ లో ఉంది. మరో వైపు కుమార్తె ఆత్మహత్య కు జగదీష్ కారణం అంటూ ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ దుర్ఘటన లో తప్పెవరిది..? పెళ్ళికి నో చెప్పడం జగదీశ్ చేసిన తప్పా..? నో చెప్పగానే ఆత్మహత్య చేసుకోవడం ప్రత్యుష చేసిన తప్పా..?

 

You may also like