కరోనాని ధైర్యంగా జయించింది…16 రోజుల క్రితమే బిడ్డకు జన్మనిచ్చింది.! కానీ ఇంటికి రాగానే ఆ వార్త విని.?

కరోనాని ధైర్యంగా జయించింది…16 రోజుల క్రితమే బిడ్డకు జన్మనిచ్చింది.! కానీ ఇంటికి రాగానే ఆ వార్త విని.?

by Anudeep

Ads

కరోనా ను చూస్తుంటే సామాన్యుల బాధలు.. భయాలు మాములుగా లేవు. మరి వృద్ధులు, గర్భిణీల పరిస్థితి మరింత ఇబ్బందికరం గా ఉంది. గర్భిణీ అయి ఉండి.. కరోనా సోకడం తో వారి పరిస్థితి మరింత కఠినం అవుతోంది. అటు బిడ్డకు కూడా సోకుతుందేమోనన్న భయం, ఏదైనా జరిగితే బిడ్డకు ప్రమాదమన్న భయం రాను రాను ఎక్కువ అవుతోంది. తాజాగా.. విజయవాడ న్యూరాజరాజేశ్వరీపేట కు చెందిన ఓ గర్భిణీకి కూడా కరోనా సోకింది.

Video Advertisement

pramila

ఆమె కరోనా ను ఎదుర్కొని.. పండంటి మగబిడ్డ కి జన్మని ఇచ్చింది. ఆమె కూడా కరోనా నుంచి కోలుకుని సంతోషం గా ఇంటికి బయలుదేరింది. అయితే.. ఆమె కు డెలివరీ చేయడానికి పెద్ద ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. దీనితో ఆమె కొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉంది.. తిరిగి ఇంటికి వచ్చేసరికి ఆమె మరో విషాదాన్ని చూడాల్సి వచ్చింది. ఆమె కన్న తల్లి అప్పటికే కరోనా సోకి ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోయింది.

pramila 2

అయితే, ఆమె కూడా ఆసుపత్రిలో ఉండడం, ఆపరేషన్ చేయించుకుని ఉండడం తో ఈ విషయాన్నీ ఆమె కుటుంబ సభ్యులు ఆమెకు తెలపలేదు. ఇంటికి రాగానే.. ఆమెకు ఈ విషయం తెలియడం తో ఆమె ఒక్కసారి గా కుప్పకూలిపోయింది. ఆపరేషన్ చేయించుకున్న మనిషి కావడం తో ఆమె తట్టుకోలేక మృతి చెందింది. ఈ ఘటన స్థానికం గా కన్నీరు పెట్టిస్తోంది. ఆమె పేరు ప్రమీల. ఆమె వెంకటేశ్వరరావు, రమాదేవి దంపతుల కుమార్తె.

pramila 1

వెంకటేశ్వరరావు, రమాదేవి దంపతులకు ఇద్దరు ఆడబిడ్డలు, ఒక మగపిల్లాడు సంతానం. వెంకటేశ్వరరావు బిఎసెన్ఎల్ లో పని చేసి ఇటీవలే రిటైర్ అయ్యారు. చిన్న కుమార్తె ప్రమీల హెచ్ డి ఎఫ్ సి బ్యాంకులో పని చేసేది. తనతో పాటు పనిచేసే రమేష్ ను ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే.. గర్భిణీ కావడం తో పుట్టింటిలోనే ఉంటోంది. కరోనా నేపధ్యం లో ఆమెతో పాటు పలువురు కుటుంబ సభ్యులు కరోనా బారిన పడ్డారు. ఆమె గర్భిణీ అయినా.. ఎంతో ధైర్యం గా ఈ మహమ్మారిని జయించి 16 రోజుల క్రితమే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ.. తల్లి మరణ వార్త తట్టుకోలేక ప్రాణాలు విడిచింది. ఆ పసికందు తల్లిలేని వాడయ్యాడు.


End of Article

You may also like