Ads
చిన్న చిన్న కారణాలకి, సమస్యలకు కూడా నేటి యువతరం ఆత్మహత్య వైపు అడుగులు వేస్తోంది. తాజాగా.. ఓ యువజంట ఆత్మహత్య చేసుకుంటూ తీసుకున్న సెల్ఫీ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఈ వీడియో లో ప్రేమికుడు తాను చెప్పాలనుకున్నది చెప్పేసి హ్యాపీ గానే ఉంటాం అంటూ వీడియో ను ముగించారు.
Video Advertisement
ఈ వైరల్ అవుతున్న వీడియో లో సదరు ప్రేమికుడు ఆల్రెడీ పెళ్లి అయినా అమ్మాయిని ప్రేమ పేరు తో వేధించడం తప్పు అంటూ ఎవరికో హితబోధ చేసాడు. జీవితం లో ఫస్ట్ జాబ్ చూసుకుని సెటిల్ అవ్వాలని ఆ తరువాత అమ్మాయిల గురించి ఆలోచించాలని హిత బోధ చేసాడు. తన ప్రేయసి గాయత్రి అంటే తనకు ప్రాణమని, ఇప్పటి వరకు ఎన్ని తగవులు వచ్చినా హ్యాపీ గానే ఉన్నామని.. కలిసే ఉన్నామని.. ఇక పై కూడా కలిసే ఉండాలని అనుకుంటున్నామని.. ఎప్పటికీ ఇలానే ఉంటామని చెప్పుకొచ్చాడు.
ఆత్మహత్య చేసుకున్న ప్రేమ జంట వారణాసి గాయత్రి, ఎం రాకేష్ లు గా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలం పరిథి లో ఓ బండి అనుమానాస్పదం గా కనిపించడం తో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడే చెప్పులు కనిపించడం, రెండు మాస్క్ లు కూడా కనిపించడం తో పోలీసులు అనుమానం వ్యక్తం చేసారు. మృతదేహాలను వెలికితీయడం కోసం గజ ఈతగాళ్లను కూడా పిలిపించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రేమ జంట చేసిన పనికి అందరు ఓ వైపు బాధపడుతున్నారు.. మరో వైపు విమర్శిస్తున్నారు. ఆ వీడియో ని మీరు ఇక్కడ చూడవచ్చు.
Watch Video:
End of Article