అందరిని నవ్వించే “సుమ” గారు…ప్రతిరోజు ఇంటికి వెళ్ళగానే ఆ ఫోటో చూసి బాధ పడుతుంటారు అంట.!

అందరిని నవ్వించే “సుమ” గారు…ప్రతిరోజు ఇంటికి వెళ్ళగానే ఆ ఫోటో చూసి బాధ పడుతుంటారు అంట.!

by Anudeep

Ads

బుల్లితెరపై ఎటువంటి పరిచయం అవసరం లేని యాంకర్ ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేరు….సుమ కనకాల. ఈ పేరుకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అటు టీవీ షోస్ లో ఇటు ఆడియో ఫంక్షన్స్ లో ఎప్పుడు సందడి చేస్తూ సుమ కనిపిస్తూనే ఉంటారు.
సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు ఉన్నప్పటికీ సుమ తన టాలెంట్ తో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది.

Video Advertisement

సుమక్క ఎక్కడ ఉంటే అక్కడ పంచల వర్షం ….. నవ్వుల పువ్వులు ఉండాల్సింది. సుమ యాంకరింగ్ లో ఒక రకమైన చమత్కారం తప్ప ఎటువంటి వల్గారిటి , ఎక్స్పోజింగ్ ఉండదు. తెలుగుతనానికి నిలువెత్తు నిదర్శనం గా ఎప్పుడు ఆమె కట్టు బొట్టు ఉండడం ఎంతో మందికి నచ్చిన విషయం.ఎప్పుడు సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఉండే సుమ కన్నీరు పెట్టుకున్న సందర్భాలు చాలా తక్కువ. ఈమెకి కష్టాలు లేవా..? అని అందరూ అనుకుంటారు..కానీ సుమ కూడా రోజు ఇంటికి వెళ్లి బాధపడుతుందట. కన్నీరు పెట్టుకుంటుందట ఎందుకో తెలుసా..?

రాజీవ్ కనకాల అమ్మగారు, లక్ష్మి కనకాల సుమ కు పెద్ద సపోర్ట్. తన అత్తగారి కారణంగానే తను తన కెరీర్ లో ఇంత సక్సెస్ సాధించగలిగాను అని సుమా ఎన్నో సందర్భాలలో చెప్పుకొచ్చారు. సుమకి వాళ్ళ అత్తగారు అంటే చాలా గౌరవం మరియు ఇష్టం. ఆమె ఎప్పుడూ తనని అత్తగా చూడలేదు కేవలం తన తల్లిగానే భావించింది. తాను ఫంక్షన్స్ ,షోస్ ,ఈవెంట్స్ అని ఇంటికి దూరంగా ఉన్నా తన పిల్లలకు ఏ లోటు లేకుండా దగ్గర ఉంది ఆమె అత్తగారు జాగ్రత్తగా చూసుకునేదట.

కానీ ఇప్పుడు ఆమె చనిపోయిన తర్వాత తన జీవితంలో తిరిగి అలాంటి సపోర్ట్ ఎవ్వరూ ఇవ్వలేరు అని సుమ రోజు బాధపడుతూ ఉంటుంది. ప్రతిరోజు ఇంటికి వెళ్ళగానే ఆమె ఫోటో చూసి బాధపడుతూ ఉంటానని ఒక స్నేహితురాలితో సుమ చెప్పిన విషయం మీడియాలో లీక్ అవ్వడంతో ….ఇప్పుడు సుమక్కకు వచ్చిన కష్టం తెలిసి ఆమె అభిమానులు కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు.


End of Article

You may also like