ఇద్దరిని పెళ్లి చేసుకున్న దురదృష్టవంతురాలు.. చివరకు భర్త చేతిలో.? అసలేమైందంటే..?

ఇద్దరిని పెళ్లి చేసుకున్న దురదృష్టవంతురాలు.. చివరకు భర్త చేతిలో.? అసలేమైందంటే..?

by Anudeep

Ads

పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలన్న ఆమెను విధి మరోసారి వెక్కిరించింది. ఆర్ధిక గొడవల కారణం గా ఆమె భర్త ఆమెని హత్య చేసాడు. ఆ తరువాత పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఈ ఘటన కేరళలోని కుందర పోలీస్ స్టేషన్ పరిధి లో చోటు చేసుకుంది. అసలు వివరాల్లోకి వెళితే..,

Video Advertisement

kruthi 4

కొల్లం నివాసి వైశాఖ్ బైజు (28) సోమవారం రాత్రి 10 గంటల సమయం లో తన భార్య కృతి మోహన్ ను హత్య చేసాడు. ఈ ఏడాది ఫిబ్రవరి లో వైశాఖ్ కృతిని వివాహం చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన కధనం ప్రకారం, కృతి కి నాలుగేళ్ళ కిందటే వివాహం అయింది. ఆ తరువాత ఆమె తన భర్త తో విడిపోయింది. అప్పటికే ఆమెకు మూడు సంవత్సరాల కూతురు కూడా ఉంది. ఆ తరువాత ఒక ఫామిలీ ఫ్రెండ్ తీసుకొచ్చిన సంబంధం బాగుండడం తో.. ఫిబ్రవరి 2, 2019 లో కృతిని వైశాఖ్ కు ఇచ్చి పెద్దలు పెళ్లి చేసారు.

kruthi mohan 3

వైశాఖ్ కు ఇది మొదటి వివాహమే. అయితే.. అతను గల్ఫ్ కి వెళ్ళిపోయాడు. ఒక నెల క్రితమే తిరిగి వచ్చి ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాడు. బిజినెస్ కోసం అతను కృతి నుంచి పది లక్షల రూపాయలు తీసుకున్నాడు. అయితే.. వాటికి సంబంధించిన రికార్డు కాగితాలను ఇవ్వాలంటూ వైశాఖ్ అడగడం తో.. అందుకు కృతి ఒప్పుకోలేదు. అలా మొదలైన గొడవ కొంచం పెద్దదైంది. ఈ గొడవ జరిగాక వైశాఖ్ ఆమె ఇంటినుంచి కొల్లం కు వెళ్ళిపోయాడు.

kruthi

తరువాత సోమవారం 7 గంటల ప్రాంతం లో తిరిగి కృతి ఉంటున్న పుట్టింటికి వచ్చాడు. అందరితో మాట్లాడి.. బెడ్ రూమ్ లోకి వెళిపోయాడు. అందరు టివి చూస్తున్న సమయం లో అతను బెడ్ రూమ్ లోనే ఉన్నాడు. కృతి కూడా లోపలే ఉంది. 9 30 సమయం లో కృతి తల్లి బిందు డోర్ కొట్టి భోజనానికి రావాలంటూ పిలిచింది. అయితే.. తాము కాసేపు ఆగి తింటామని కృతి బదులిచ్చింది. అయితే.. 10 30 అయినా తరువాత కూడా వారు బయటకు రాకపోవడం తో.. ఆమె తల్లి మరొక సారి డోర్ ని కొట్టింది.

kruthi mohan1

ఈసారి వైశాఖ్ తలుపు తీసి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాలని , కృతి కి ఎదో ఇబ్బంది గా ఉందని చెప్పాడు. అప్పుడే కృతి తల్లి తండ్రులకు అనుమానం వచ్చింది. కృతిని ఎత్తుకుని బయటకు తీసుకువచ్చి పడుకోబెట్టి.. సడన్ గా బయటకు వెళ్ళిపోయాడు. దీనితో కృతి తండ్రి మోహన్ వెనకాలే వెళ్ళాడు.. వైశాఖ్ కారు తీసుకుని వెళ్లిపోవడం తో కృతి తల్లి తండ్రులు వెంటనే పోలీసులకు ఫోన్ చేసారు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగానే.. మంగళ వారం రాత్రి వైశాఖ్ కుందరా పోలీస్ స్టేషన్ లో సరెండర్ అయ్యాడు. పోస్ట్ మార్టం పూర్తి అయ్యాక.. కృతి అంత్యక్రియలు నిర్వహించారు.


End of Article

You may also like