Ads
భారతీయ వివాహ వ్యవస్థ ఎంత ఔన్నత్యమైనదో.. మహిళల పట్ల భారత సమాజం లో ఉన్న భావాలు అంత సంకుచితమైనవి. అందుకే మహిళలు పెళ్లి తరువాత ఉద్యోగం చేయడానికి కొందరు మనస్పూర్తి గా ఒప్పుకోలేరు. ఇలా పెళ్లి తరువాత ఉద్యోగం చేయాలనుకుని.. చేయలేక సతమతమవుతున్న వారు చాలా మందే ఉన్నారు. వారిలో విద్య కూడా ఒకరు. పెళ్లి అయ్యాక తన జీవితం ఎలా మారిపోయిందో విద్య మాకు పంపిన మెసేజ్ ను మీకు అందిస్తున్నాం.
Video Advertisement
“నా పేరు విద్య. నేను ఎంబీఏ పూర్తి చేసాను. నాకు కెరీర్ పై చాలా ప్లాన్స్ ఉండేవి. ఏదైనా మంచి పొజిషన్ లో ఉండాలి అని కలగనేదాన్ని. సొంతం గా ఓ ఫిట్ నెస్ సెంటర్ ను పెట్టి రన్ చేయాలనేది నా కోరిక. సొంతం గా నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని అనుకునే మనస్తత్వం నాది. కానీ.. పెళ్లి అయ్యాక ఒక్కసారి గా పరిస్థితులన్నీ మారిపోయాయి. పెళ్ళికి ముందు నేను ఏమి చేస్తాను అన్నా నా తల్లి తండ్రులు ముందు పెళ్లి చేసుకో.. ఆ తరువాత నీకు నచ్చినట్లు ఉండు అని చెప్పేవారు. కానీ, పెళ్లి అయ్యాక నా జీవితం నా చేతుల్లో లేదు అనిపించింది.
నా అత్తగారు, మామ గారు, భర్త.. ఇలా నేను ఏమి చేయాలన్న వీరందరి పర్మిషన్ తీసుకోవాలి. నా అత్తా మామ లు ముందు పిల్లలను కనండి.. ఆ తరువాత ఏమైనా ప్లాన్ చేసుకోండి అని చెప్పారు. నా ఆశలు నెరవేర్చుకోవడానికి ఇంకా టైం ఉందని అర్ధం అయింది. కొంత కాలం పాటు వీరికి అనువు గా ఉండాలని అర్ధం అయింది. నా భర్త తో ప్రేమకు చిహ్నం గా మాకో పండంటి బాబు పుట్టాడు. బాబు పుట్టిన తరువాత రోజు మొత్తం వాడితోనే సరిపోయేది. బాబు ఆలనా పాలన చూసుకోవడం, ఇంట్లో పనులు చక్కపెట్టుకోవడం వంటి పనులే సరిపోయేవి.
నాకంటూ సొంత కలలను నెరవేర్చుకోవడానికి సమయం ఉండేది కాదు. నా కాళ్ళ మీద నేను నిలబడాలని అనుకునే దాన్ని. కానీ, ఇప్పుడు ఏ చిన్న అవసరం వచ్చినా నేను నా భర్తనే అడగాల్సి వస్తోంది. నాకు ఏదైనా నచ్చినవి కొనుక్కోవాలి అన్నా నేను నా భర్తనే అడగాలి. నేనేమి ఖాళి గా లేను. రోజంతా నా కుటుంబం పనులను చేయడానికే సమయం సరిపోతుంది. కానీ, నాకేమి జీతం ఇవ్వరు. ఒక్కరోజు కూడా నాకు ఎలాంటి హాలిడే ఉండదు. అవిశ్రాంతం గా, నిర్విరామం గా పనిచేయాల్సి వస్తుంది. నాలాగా ఇంకెంతమంది ఉన్నారో..
NOTE: All the images used in this article are just for representative purposes. But not the actual characters.
End of Article