ప్రేమించింది.. పెళ్లి కోసం మతం మారింది.. చివరకు ఆ కారణం తో జైల్లో మగ్గుతున్న భారత డెంటిస్ట్.. అసలేమైంది..?

ప్రేమించింది.. పెళ్లి కోసం మతం మారింది.. చివరకు ఆ కారణం తో జైల్లో మగ్గుతున్న భారత డెంటిస్ట్.. అసలేమైంది..?

by Anudeep

Ads

ఆఫ్గనిస్తాన్ ను తాలిబన్లు ఆక్రమించుకోవడం పై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. ఎక్కడ చూసినా ఇదే టాపిక్. ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్ పరిస్థితులు చాలా ఆందోళనకరం గా ఉన్నాయి. అక్కడి ప్రజలు ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని దేశం వదిలి పారిపోతున్నారు. దేశం వదిలి వెళ్లలేని వారు ఎప్పుడు ఏమి జరుగుతుందో అన్నట్లు బతుకుతున్నారు.

Video Advertisement

kerala women 1

సాధారణ ప్రజల పరిస్థితే ఇలా ఉంటె.. ఇంకా జైల్లో ఉన్న వారి బాధ వర్ణనాతీతం. ఆ జైలులో భారత్ లోని కేరళ కు చెందిన ఓ మహిళ కూడా ఉంది. ఆమె దీన గాధ కన్నీళ్లు పెట్టిస్తోంది. వివరాల్లోకి వెళ్తే, కేరళకు చెందిన తిరువనంతపురం నివాసి నిమిష బాగా చదువుకుంది. ఆమె తల్లి తండ్రులు బిందు, సంపత్ లు. నిమిష బిడిఎస్ చదివి డెంటిస్ట్ అయ్యింది. అయితే ఒకతన్ని ప్రేమించి.. అతని కోసం పెద్దలను ఎదిరించి మతం కూడా మార్చుకుంది.

kerala women 2

అతన్నే పెళ్లి చేసుకుని ఫాతిమా గా తన పేరు ని మార్చుకుంది. 2016 లో ఆమె తన భర్త తో కలిసి ఆఫ్గనిస్తాన్ కు వెళ్ళిపోయింది. అక్కడే పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఓ సారి కాల్పుల్లో ఆమె భర్త మరణించాడు. దీనితో ఆమెకు భయం పట్టుకుంది. పాపతో కలిసి ప్రభుత్వానికి లొంగిపోయింది. వారు ఆమెను ఉగ్రవాది గా పేర్కొని జైల్లో ఉంచారు. మరో వైపు ఆమె తల్లి బిందు కూతురు పరిస్థితి చూసి బాధపడి ఆమెను తిరిగి ఇండియా కు తీసుకురావాలంటూ ప్రభుత్వానికి దాదాపు 1882 సార్లు కోరింది.

kerala women 3

కనిపించిన రాజకీయ నాయకులందరికీ ఆమె తన గోడు చెప్పుకుంటోంది. తన కూతురు ఉగ్రవాది కాదని.. ఆమె వల్ల దేశానికీ ఎలాంటి ముప్పు లేదని.. తన కూతురుని ఇంటికి తీసుకురావాలని ఆమె కోరుతోంది. ఆమె కూతురు తో పాటు మరో 20 మంది యువతులు కూడా ఆఫ్ఘన్ వెళ్లారని.. వారిలో కూడా ముగ్గురు మతం మార్చుకున్నారని ఆమె చెబుతోంది. వారు కూడా ప్రస్తుతం జైళ్లలో మగ్గుతున్నారని.. వారిని విడిపించాలని ఆ యువతుల కుటుంబ సభ్యులు కోరుతున్నారు.


End of Article

You may also like