Ads
ఒక్కొక్కసారి కొన్ని విషయాలు చాలా బాధ కలిగిస్తాయి. అవి మనకు సంబంధించినవే అవ్వాల్సిన అవసరం లేదు. మనం కూడా ఎన్నో సార్లు అవతల వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలను చూసి వాళ్ల గురించి ఆందోళన చెంది ఉంటాం. అలా మనవి కాకపోయినా కూడా పక్క వాళ్ళ కు సంబంధించిన విషయాలు కూడా మన మెదడు ని ప్రభావితం చేస్తాయి.
Video Advertisement
కోరా లో ఒక వ్యక్తి “మీరు చూసిన బాధాకరమైన సంఘటన ఏంటి?” అనే ప్రశ్న పోస్ట్ చేశారు. దానికి కాకినాడకు చెందిన రామ్ తేజ అనే వ్యక్తి ఈ విధంగా సమాధానం ఇచ్చారు.
ఇతను మా అపార్ట్మెంట్ లో లిఫ్ట్ ఆపరేటర్ గా పని చేస్తున్నారు. పొద్దున ఎనిమిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు డ్యూటీ ఉంటుంది. నేను దాదాపు 9:20 లేదా 9:25 మధ్యలో లిఫ్ట్ ఎక్కుతాను. నేను లిఫ్ట్ ఎక్కిన ప్రతిసారీ అతను ఫోన్ పట్టుకొని ఆందోళన ఫోన్ వైపు చూస్తూ ఉండేవారు.
ఇది నేను చాలా సార్లు గమనించాను. ఒక రోజు అసలు విషయం ఏమిటో తెలుసుకుందామని ఫోన్ లో అలా ఏం చూస్తారు అని అడిగాను. అందుకు అతను 9:30 కి తన తన కూతురికి ఫోన్ చేస్తానని, అందుకే 9:30 ఎప్పుడు అవుతుందా అని ఎదురుచూస్తూ ఉంటాను అని,
తన కూతురికి ఇటీవల పెళ్లయిందని, వాళ్ల అల్లుడికి ఇతను తన కూతురు తో మాట్లాడటం ఇష్టం లేదు అని, వాళ్ళ అల్లుడు 9:30 కి ఆఫీస్ కి బయలుదేరుతాడు అని, అతను ఆఫీస్ కి బయలుదేరిన తర్వాత తన కూతురు కి ఫోన్ చేసి ఎలా ఉంది, పరిస్థితి అంతా బాగానే ఉందా లేదా అనే విషయాలు కనుక్కుంటానని చెప్పాడు.
ఒక తండ్రి తన కూతురు కోసం ఇంతగా ఆందోళన చెందడం చూసి నాకు చాలా బాధగా అనిపించింది. నేను ఈ సమాధానం అప్ వోట్స్(లైక్స్) కోసం రాయలేదు. కానీ మీరు అందరూ అప్ వోట్ చేసినందుకు థాంక్స్. మీ అందరినీ చూస్తే ఇలా గృహహింసను సహించని వాళ్ళు, నా మాటతో ఏకీభవించే వాళ్ళు చాలామంది ఉన్నారు అన్న విషయం అర్థం అవుతోంది.
నా దృష్టిలో గృహ హింస అనేది ఆడవాళ్ళ పై జరిగే నేరాల లో ముందు వరుసలో ఉంటుంది. కానీ ఆడవాళ్లు ఇంట్లో వాళ్లకు ఎదురయ్యే పరిస్థితుల గురించి మాట్లాడితే సమాజంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో అనే ఆలోచన వల్ల తమకు ఎదురయ్యే సమస్యలను బయటికి చెప్పరు” అని కోరా జవాబులో పేర్కొన్నారు.
credits: quora
End of Article