సాధువులు కాషాయం రంగు ధరించడం వెనుక ఉన్న కారణం ఇదే..

సాధువులు కాషాయం రంగు ధరించడం వెనుక ఉన్న కారణం ఇదే..

by Anudeep

కాషాయరంగు అనగానే మనకి రాజకీయాలే గుర్తొస్తాయి.. కాని ప్రస్తుతం అది అప్రస్తుతం.. ఇన్ని రంగులుండగా సాధువలు కాషాయాన్నేఎందుకు ధరిస్తారు.. ఈ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? సాధువులంటేనే శాంతి కాముకులు కదా తెలుపు ధరించవచ్చు కదా.. సాధువలంటే అన్ని త్యజించిన వారు కదా నలుపు ధరించవచ్చు కదా.. ప్రశాంతత కి గుర్తు నీలం, ప్రేమకి గుర్తు గులాభి, శక్తికి గుర్తు ఎరుపు, ఇలా ఇన్నిరంగులుండగా కాషాయమే ఎందుకు?

Video Advertisement

 

హిందు మతానికి సంబందించిన సాధువులు మాత్రమే కాదు, బౌధ్ద మతానికి చెందిన సాధువులు  కూడా కాషాయాన్నే ధరిస్తారు..కాబట్టి ఈ రంగును మత ప్రాదిపదికన కాకుండా..ఈ రంగును ఎంచుకోవడానికి బలమైన కారణం ఉంటుంది..ఆ కారణం ఏంటంటే ఒక్కో రంగు ఒక్కో విషయానికి గుర్తుగా ఉన్నట్టే కాషాయరంగు  సూర్య తేజాన్ని ప్రతిబింబిస్తుంది. సూర్యుడు చైతన్యానికీ జ్ఞానానికీ ప్రతీక. సూర్యుని వెలుతురుకి పేద, ధనిక భేదాలుండవు. ఋషులు, యోగులు సన్యాసులలో కూడా అందరినీ సమానంగా చూసే గుణాన్ని కాషాయం సూచిస్తుంది . అందుకే అందరూ సమానం అనే దానికి గుర్తుగా కాషాయాన్ని ధరిస్తారు.

అదేవిధంగా భగభగ మండే అగ్ని కణాలు కూడా కాషాయ రంగులోనే ఉంటాయి..అంటే కాషాయం అగ్నికి ప్రతీకగా చెప్పవచ్చు. ఒక వ్యక్తి సాధువుగా మారాడంటే తన అనే స్వార్దాన్ని వదిలేసి, తనలోని అహన్ని, కామ క్రోధఅరిషడ్వర్గాలని దహించివేసేది అగ్నియేగా, కాషాయాన్ని ధరిస్తారు. కేవలం కామక్రోధాలనే కాదు కుల, మత, పేద,ధనిక భేదాలనూ, అన్ని రకాల కట్టుబాట్లనూ జ్ఞానమనే దివ్యాగ్నిలో ఆహుతి చేయడానికి, చేసారనడానికి గుర్తుగా కూడా కాషాయం ధరిస్తారు.

సాధువులు , యోగులు కాషాయం రంగు ధరించడం వెనుక ఉన్న కారణాలివే… సో…అర్థమైందిగా..ప్రతి ‌రంగుకు ఒక లక్షణముంటుంది…దాని ప్రకారం మన ఆలోచనలకు అనుగుణంగా అయా రంగుల్ని మనం ఓన్ చేసుకుంటాం..


You may also like