ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రజల జీవితాలని చిన్నాబిన్నం చేస్తుంది..భారత దేశం మొత్తం దాదాపు రెండు లక్షల మంది కరోనా భారిన పడ్డారు.ఇలాంటి కష్ట కాలంలో మనకు తోడు గా ఉన్నది ఆరోగ్యశాఖ,రక్షణ శాఖ,మరియు పారిశుద్ద కార్మికులు..తమ ప్రాణాలని సైతం అడ్డు పెట్టి నిస్వార్థంగా ప్రజలకి సేవలని అందిస్తున్నారు.ఈ తరుణంలో ఎందరో డాక్టర్లు,నర్సులు,పోలీసులు తమ విధి నిర్వహణలో కరోనా భారిన పడుతున్నారు కూడా.

Video Advertisement

అయితే ఇలాంటి సేవలు అందించే వైద్య సిబ్బందికి తన కార్య నిర్వహణ మధ్యలో సొమ్మ సిల్లి పడిపోతే కనీసం పట్టించుకున్నవారు లేరు.దాదాపు అరగంటపాటు అతన్ని ఎవరు పట్టించుకోలేదు.ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లా లో జరిగింది హరిలాల్ ప్రజాపతి 108 అంబులెన్స్ లో తన విధుల్ని నిర్వహిస్తుంటారు. క్షయ ఆసుపత్రి నుంచి కొంత మంది కరోనా బాధితుల్ని బుందేల్ ఖండ్ వైద్య కళాశాల కు తరలించే ప్రయత్నం లో ఈ పని ముగించి బయటకు వస్తున్న తరుణం లో.

PPE కిట్లు ధరించి ఉండటం..బయట ఉష్ణోగ్రత 44 డిగ్రీలకు పైనే ఉండటం తో సొమ్మసిల్లి పడిపోయాడు. పడిపోయిన 25 నిమిషాలకు గాని ఎవరు గుర్తించలేదు.ఇది చూసిన అంబులెన్సు డ్రైవర్ బీఎంసీ సిబ్బంది సహాయం కోరగా. వారు ప్రజాపతిని ఆసుపత్రిలోకి తీసుకువెళ్లేందుకు నిరాకరించారు, ఏమి చెయ్యాలో పాలుపోని డ్రైవర్ కి సమయానికి అక్కడికి పారా మెడికల్ సిబ్బంది రావటం తో జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఇప్పుడు అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందంటూ..వైద్యాధికారులు తెలిపారు.మధ్యప్రదేశ్ లో కరోనా ఉదృతి అధికంగా ఉంది.దాదాపు 7000 మంది కరోనా భారిన పడ్డారు.వైరస్ కారణంగా 313 మంది మరణించారు.ప్రజలకు సేవనందించే వారికి ఇలాంటి సంఘటన ఎదురు కావటం నిజంగా బాధాకరమైన విషయం.