బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న ఎవలిన్ శర్మ సాహో సినిమా తో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైన సంగతి తెలిసిందే. అయితే.. సాహో సినిమా చేస్తున్న సమయం లోనే ఈ బ్యూటీ ప్రభాస్ అంటే తనకు ఇష్టమంటూ ఝలక్ ఇచ్చింది. ఆ తరువాత 2019 లోనే ఆస్ట్రేలియా లో తన బెస్ట్ ఫ్రెండ్ తుషార్ బిండితో నిశ్చితార్ధం చేసేసుకుంది. ఆ తరువాత సినిమాలకూ దూరమైంది.

evelyn sharma got married

నిశ్చితార్ధం అయ్యి చాలా రోజులే కావస్తున్నా.. వివాహం కాకపోవడం తో పలు రూమర్లు కూడా హల్ చల్ అయ్యాయి. ఇటీవలే ఈ అమ్మడు తన పెళ్లి గురించి బయట పెట్టేసింది. గత నెలలోనే.. సీక్రెట్ గా ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ ను పెళ్లి చేసేసుకుంది. “బెస్ట్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోవడం కంటే ఆనందం ఇంకేమి ఉంటుంది.. మారీడ్ లైఫ్ గురించి ఉత్సాహం గా ఎదురు చూస్తున్నాం..” అంటూ ఆమె ఆనందం గా చెప్పుకొచ్చింది.