Ads
ఇండస్ట్రీ లోకి వచ్చిన తక్కువ సమయానికే మంచి పాపులారిటీని సాయి పల్లవి సొంతం చేసుకుంది. ఈమె కమర్షియల్ సినిమాల్లో నటించినప్పటికీ కాస్త డిఫరెంట్ గా ఉన్న క్యారక్టర్లని మాత్రమే ఎంపిక చేసుకుంటుంది. కానీ ఈ మధ్య సాయి పల్లవి కి అవకాశాలు బాగా తగ్గి పోయాయి.
Video Advertisement
కేవలం ఒకే ఒక సినిమా విడుదలకు ఇప్పుడు రెడీ గా ఉంది. ఫిదా సినిమా తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన సాయి పల్లవి గ్లామర్ పాత్రలు చేయక పోయినా స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో క్రేజ్ ని సంపాదించుకుంది.
ఇప్పటి దాకా ప్రతీ సారి తనకి నచ్చిన కథల్ని మాత్రమే ఎంపిక చేసుకుంటూ సినిమాల్లో నటిస్తూ వచ్చింది. అంతే కానీ ఈ అమ్మడు ఎప్పుడు తొందర పడలేదు. నాగ చైతన్య సరసన లవ్ స్టోరీ సినిమా లో నటించి మంచి హిట్ ని సాయి పల్లవి అందుకుంది. అలానే నాని తో కలిసి నటించిన శ్యామ్ సింగరాయ్ కూడా మంచి హిట్ ను సాయి పల్లవి కి అందించింది.
అయితే ఈమె రెండు హిట్స్ ని అందుకున్నప్పటికీ ప్రస్తుతం ఒకే ఒక్క సినిమా లో నటించింది. అదే విరాటపర్వం. ఈ సినిమా గత ఏడాది నుండి విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ తెర మీదకి ఇంకా రాలేదు. ఈ సినిమా ఓటీటీ లో విడుదలయ్యే అవకాశం కనబడుతోంది.
భోళా శంకర్ సినిమా లో సాయి పల్లవి కి నటించే అవకాశం వచ్చినా ఆమె దానిని తిరస్కరించింది అయితే ఆమె కథ నచ్చితేనే ఊ అనేట్టు కనపడుతోంది. అప్పటి వరకు సాయి పల్లవి సైలెంట్ గానే ఉండేలా వుంది.
End of Article