సాయి పల్లవి ఒక పాత్ర ఒప్పుకోవాలి అంటే… ఇంత కథ ఉంటుందా..?

సాయి పల్లవి ఒక పాత్ర ఒప్పుకోవాలి అంటే… ఇంత కథ ఉంటుందా..?

by Megha Varna

Ads

నటన తో, డాన్స్ తో సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేస్తుంది. ప్రస్తుతం అయితే సాయి పల్లవి వరుస హిట్స్ తో దూసుకెళ్లి పోతోంది. ఈ మలయాళీ భామ వేసే స్టెప్పులకి ఎవరైనా ఫ్యాన్స్ అయిపోతారు. అందరికీ భిన్నంగా, తన స్వభావానికి దగ్గరగా ఉండే సినిమాలు తియ్యడం సాయి పల్లవి నైజం.

Video Advertisement

నటనలోనూ, నాట్యం లోను, పెద్ద హీరోలతో పోలిస్తే దేనికి తీసిపోదు ఈ భామ. తను ఎంచుకునే కథలతోనే అందరి మనసులు దొచేస్తోంది సాయి పల్లవి. ఇలా పాత్రలను ఎంపిక చేసుకుని తను నటించింన సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి.

ప్రేమమ్ చిత్రం తో వెండి తెరలోకి అడుగు పెట్టింది సాయి పల్లవి. ఈమె డాక్టర్ చదువుకున్నప్పటికే నటన మీద ఆసక్తి తో ఇండస్ట్రీ లోకి వచ్చేసింది. యాక్టర్ గా ఈ భామ అందరినీ ఫిదా చేస్తూనే ఉంది. ఇక ఈమె నటించిన ఫిదా సినిమా గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. భానుమతి ఒక్కటే పీస్ అంటూ చక్కటి నటనతో ఆకట్టుకుంది సాయి పల్లవి. ఇలా తాను నటించిన సినిమాల్లో పాత్రలు వెరైటీగా ఉంటాయి.

ఎప్పుడూ కూడా ఈమె గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ మంచి పాత్రలను ఎంపిక చేసుకుంటుంది. అయితే సినిమాని ఎంపిక చేసుకునే విషయం పై సాయి పల్లవి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. మరి వాటి గురించి చూద్దాం… ఏదైనా పాత్ర చేయాలంటే స్పెషల్ గా రూల్స్ ని ఏమి పెట్టుకోదట.

తన పాత్ర కోసం ముందే ఎటువంటి వాటిని సిద్ధం చేసుకోదట. ఇలాంటివి ఏమీ తాను పాటించనని చెప్పింది. అయితే సెట్ లో ఉండే వాతావరణం ఇతర నటుల అభినయం బట్టి ఈమె పాత్ర పోషిస్తూ ఉంటానని అంది. ఇక ఆమె కథని చూసినప్పుడు అయితే.. సినిమా ఎలా ఉంటుంది అని మైండ్ లో రన్ చేసుకుంటూ వుంటుందట. కథ చదివేటప్పుడు సినిమాని ఆస్వాదిస్తూ వుంటుందట.


End of Article

You may also like