నటనతో, డాన్స్ తో సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేస్తుంది. ప్రస్తుతం అయితే సాయి పల్లవి వరుస హిట్స్ తో దూసుకెళ్లిపోతోంది. ఈ మలయాళీ భామ వేసే స్టెప్పులకి ఎవరైనా ఫ్యాన్స్ అయిపోతారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సాయి పల్లవి చెల్లెలు పూజ కన్నన్ వెండితెరపై సక్సెస్ అందుకోవడానికి రెడీగా ఉంది.

Video Advertisement

సాయి పల్లవి చెల్లెలు పూజ కన్నన్ చిత్తిరై సెవ్వానమ్ సినిమాలో నటిగా కనపడనుంది. స్టంట్ మాస్టర్ సిల్వా ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా సాయి పల్లవి సోషల్ మీడియాలో తన చెల్లెలు పూజా కన్నన్ గురించి ఒక పోస్ట్ చేసింది.

నటిగా ప్రేక్షకులకి తన చెల్లెలు ఈరోజు పరిచయమవుతున్న రోజు అని సాయి పల్లవి సినిమా చెప్పింది. అలానే నటిగా సినిమా తీసేటప్పుడు తన చెల్లెలు ఎంతలా ఎంజాయ్ చేసిందో ప్రేక్షకులు కూడా సినిమాని అంతే ఎంజాయ్ చేస్తారని ఆమె చెప్పింది. ఈ చిత్రం జీ5 వేదికగా ఓటిటీలో రిలీజ్ అయ్యింది.