“తన గొంతే తనకి శాపం అనుకున్నాడు… కానీ చివరికి..?” ఈ “సరిగమప” కంటెస్టెంట్ గురించి తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!

“తన గొంతే తనకి శాపం అనుకున్నాడు… కానీ చివరికి..?” ఈ “సరిగమప” కంటెస్టెంట్ గురించి తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!

by Megha Varna

Ads

ఈ రోజుల్లో టాలెంట్ ఉంటే చాలు సోషల్ మీడియా ద్వారా ఈజీగా పాపులర్ అయిపోవచ్చు. చాలా మంది ఆర్టిస్టులు, సింగర్లు అలానే పాపులర్ అవుతున్నారు. నిజానికి ఎలా స్టార్స్ అవుతామనేది చెప్పలేము. ఒక్క వీడియో చాలు పాపులారిటీని పెంచేయడానికి.

Video Advertisement

సాయి సాన్విద్ గురించి ఈ మధ్య కాలంలో అనేక వార్తలు వచ్చాయి. మీరు కూడా వినే ఉంటారు. సరిగమప లో సాయి సాన్విద్ అద్భుతంగా పాడాడు.

సాయి సాన్విద్ ది విశాఖపట్నం. తన చిన్నప్పటి నుండి కూడా గొంతు అమ్మాయిలాగ ఉండేది. దీంతో సొసైటీలో ఎగతాళి చేసే వారు. చాలా రకాలుగా కామెంట్లు కూడా చేసేవారు. అమ్మాయిలా మాట ఉండేదని ఎక్కువగా ఎగతాళి చేసేవారు. నిజానికి అలా ఎవరైనా హేళన చేస్తే తట్టుకోవడం కొంచెం కష్టం.

అలా ఏడిపించినప్పుడు సాయి సాన్విద్ కూడా ఎంతో బాధ పడేవాడు. పైగా తన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. ఆ తర్వాత తన తల్లిని కూడా కోల్పోయాడు. ఆ తర్వాత అన్నయ్య వాళ్లతో ఉన్నాడు. కానీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టలేక బయటికి వచ్చేశాడు. ఆ తర్వాత నెమ్మదిగా డబ్బింగ్ లో అవకాశాలు వచ్చాయి.

తన వాయిస్ శాపం అనుకున్నాడు. కానీ దాని వలనే అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు తన వాయిస్ ఏ అతనికి ప్లస్ అయ్యింది. సరిగమప తో సాయి సాన్విద్ మన ముందుకి వస్తున్నాడు. అయితే సాయి సాన్విద్ సరిగమప లో సక్సస్ అవ్వాలని మనం కోరుకుందాం. అలాగే భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్లాలని.. ఎన్నో విజయాలను సాధించాలని కోరుకుందాం.

watch video : 


End of Article

You may also like