Ads
ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీఖాన్ బాలీవుడ్ తెరకు పరిచయం అవ్వడానికి సిద్దమవుతుంది. తన మొదటి సినిమాకు సంబంధించి చాలా ప్రత్యేకమైన శ్రద్ద తీసుకుంటున్నారు. కాగా సారా అలీఖాన్ తెరంగ్రేటం గురించి బాలీవుడ్ ప్రేక్షుకులందరిలో పెద్ద చర్చలు మొదలయ్యాయి .ఈ నేపథ్యంలో సైఫ్ అలీఖాన్ తన పిల్లలతో మరియు తన మాజీ భార్య అమ్రితా సింగ్ తో తనకున్న రిలేషన్ గురించి వెల్లడిస్తూ బావోగ్వేగానికి లోనయ్యారు .
Video Advertisement
సైఫ్ అలీఖాన్ ఒక ప్రముఖ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ .. తన వివాహం మరియు తన పిల్లలు అయిన ఇబ్రహీం ఖాన్ , సారా ఖాన్ గురించి కొన్ని రహస్యాలు పంచుకున్నాడు .నేను నా భార్య అమ్రితా సింగ్ నుండి విడిపోయిన తర్వాత ఒక బాధాకరమైన తండ్రిలా మారిపోయాను .ఎప్పుడూ కూడా నా పిల్లలు ఐన ఇబ్రహీం ఖాన్ ,సారా ఖాను ను కలవడానికి చాలా వేచి చూసేవాడిని. ఆ సమయంలో మనసుకు చాలా బాధగా ఉండేది.నావి నా భార్య అమృత సింగ్ వి వేరు వేరు దారులు అయినా సరే నేను తన పర్సనల్ స్పేస్ ను గౌరవించాను .నా వాలెట్ లో నా కొడుకు ఇబ్రహీం ఖాన్ ఫోటో ఉంది. అది చూసినప్పుడల్లా చాలా మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ వస్తుంది కొన్నిసార్లు ఏడుపు కూడా వస్తుంది .అలాగే నా కుమార్తె సారాను కూడా చాలా మిస్ అవుతున్నాను .
నేను ఎంత బాధపడినా నాకు వారిని చూడడానికి అనుమతి లేదు . వారు కూడా నన్ను చూడడానికి వీలు లేదు .ఎందుకంటే ఒకవేళ నా పిల్లలు నా దగ్గరకి వస్తే తన తల్లికి వ్యతిరేకంగా ఉండేటట్లు ఆలోచనలు కలిగించే ఇంకో స్త్రీ నా జీవితంలో ఉందని అమ్రితా సింగ్ అభిప్రాయపడుతోంది .ప్రస్తుతం నా పిల్లలు , భార్య కలిసి టీవీ సీరియల్స్ లో పనిచేస్తున్నారు .నా భార్య ఆలా చేయాల్సిన అవసరం ఏంటి? నేను నా ఫామిలీ ని పోషించేందుకు సిద్ధంగా ఉన్నపుడు అని సైఫ్ అలీఖాన్ ఆవేదన వ్యక్తం చేసారు.
నా భార్య అమృత సింగ్ నా తల్లి ఐన షర్మిల నాథ్ ఠాగూర్ ను మరియు నా సోదరీమణులు ఐన సోహా అలీఖాన్ ,సబ అలిఖాన్లను వేధింపులకు గురి చేసింది అని తెలిపారు సైఫ్ అలీఖాన్ .ఇప్పటికి నాకు నా పిల్లలతో కలిసి ఉండాలని ఉంది అని తెలిపారు .నాకు నిజంగా నా పిల్లలు కావాలి .కానీ నేను నిరంతరం వారిపై పోరాడడానికి ఇష్టపడను .నా పిల్లలను నా నుండి వేరు చెయ్యాలంటే అమృత ను సారా సింగ్ ఇబ్రహీం సింగ్ అని పిలవమనండి అని తెలిపారు .ఏది ఏమైనా సైఫ్ అలీఖాన్ ఇప్పుడు నటి కరీనా కపూర్ ఖాన్ ను పెళ్లిచేసుకున్నారు .కాగా గత ఏడాది వీరికి తైమూర్ అలీ ఖాన్ పటౌడీ అనే కొడుకు జన్మించాడు.
End of Article