SAINDHAV BUDGET: వెంకటేష్ సైంధవ్ సినిమాకి కేవలం ఆ నటుల రెమ్యూనరేషన్ కే అంత బడ్జెట్ అయ్యిందా.?

SAINDHAV BUDGET: వెంకటేష్ సైంధవ్ సినిమాకి కేవలం ఆ నటుల రెమ్యూనరేషన్ కే అంత బడ్జెట్ అయ్యిందా.?

by Harika

Ads

సంక్రాంతి పండుగ కానుకగా చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి. వీటిలో వెంకటేష్ హీరోగా నటించిన సైంధవ్ సినిమా కూడా ఒకటి. అయితే ఈ సినిమా ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ప్రేక్షకుల ఆదరణ తెచ్చుకోలేకపోయింది. సినిమా కథ బాగున్నప్పటికీ కూడా రాంగ్ టైం రిలీజ్ సినిమాని బాగా దెబ్బ తీసింది. ఈ సినిమాలో వెంకటేష్ సరసన శ్రద్ధ శ్రీనాథ్, రుహాణి శర్మ, ఆండ్రియా ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, ముకేశ్ రిషి, జిషు సేన్ గుప్త, తమిళ నటుడు ఆర్య ముఖ్య పాత్రలు పోషించారు.

Video Advertisement

unnoticed details in venkatesh saindhav glimpse video

ఇది ఇలా ఉంటె ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన బడ్జెట్ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ నవాజుద్దీన్ సిద్దిఖీ ఈ సినిమాకి 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారు అంట. తమిళ నటుడు ఆర్యకి రూ. 5 కోట్ల రూపాయలు పారితోషికం ఇచ్చారని తెలిసింది.ఇక మిగతా వాళ్ళకి ఇచ్చిన పారితోషికాలు కలుపుకుంటే ఈ సినిమాకి నిర్మాత బోయినపల్లి వెంకట్ చాలా ఖర్చు పెట్టారని తెలిసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ విడుదలకి ముందు బిజినెస్ కేవలం రూ.25 కోట్లు మాత్రమే అయిందని తెలుస్తోంది. ఒటిటి ద్వారా ఈ లాస్ కొంచెం రికవర్ అవుతుండొచ్చు.

 


End of Article

You may also like