Ads
సాక్షి తన్వర్.. పేరుకి బాలీవుడ్ యాక్టర్ అయినా సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు. ఈమె నటించిన ఎన్నో సీరియల్స్ , సినిమాలు తెలుగులో డబ్ అయిన కారణంగా ఈమెకు తెలుగులో కూడా మంచి పాపులారిటీ ఉంది. ముఖ్యంగా కహాని ఘర్ ఘర్ కి…బడే అచ్చే లాగ్తే హై.. వంటి పాపులర్ సీరియల్స్ కారణంగా ఈ నటికి బాగా గుర్తింపు వచ్చింది.
Video Advertisement
2016 లో అమీర్ ఖాన్ సూపర్ హిట్ మూవీ దంగల్ను అతని భార్యగా నటించింది. ఈ సినిమా విడుదలైన కొద్ది రోజులకి బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 1000 కోట్లు వసూలు చేసింది. ఇప్పటివరకు బాలీవుడ్ చరిత్రలో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా ఈ మూవీ గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలలోకి రాకముందు ఈమె పాపులర్ టీవీ యాక్ట్రెస్. ఒకరకంగా చెప్పాలి అంటే బుల్లితెర స్టార్ హీరోయిన్.ఇక ఈమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే 50 సంవత్సరాలు వయసు వచ్చిన ఇంకా సాక్షి పెళ్లి చేసుకోలేదు. తను తన సింగిల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. అయితే ఐదు సంవత్సరాల క్రితం ఆమె ఒక కూతురికి తల్లి అయింది.
కన్నతల్లి కాదనుకోండి.. ఆమె ఆ పాపని దత్తత తీసుకుంది. 2001 కరమ్ అనే టీవీ సీరియల్ తో తన ప్రస్థానం మొదలుపెట్టిన సాక్షి..సన్సార్, దేవి, విరాసత్, కావ్యాంజలి లాంటి ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ లో నటించి ..ప్రేక్షకులని తన నటనతో మెప్పించింది.టీవీ ప్రపంచంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే నటులలో సాక్షి కూడా ఉంది.. ఆమె సుమారు ఒక 1.5 లక్షలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుందని టాక్.
End of Article