Ads
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సలార్ సినిమా రిలీజ్ హంగామా మామూలుగా లేదు. టిక్కెట్ల కోసం ప్రభాస్ ఫ్యాన్స్ క్యూ లైన్ లో పడి కొట్టేసుకుంటున్నారు. నైజంలో బుకింగ్స్ అన్ని ఆఫ్ లైన్ లో జరగడంతో థియేటర్ల ముందు కిలోమీటర్ల పొడుగునా క్యూ లైన్ లు ఏర్పడ్డాయి. ఇప్పటికే హైదరాబాదులో ఉన్న ప్రసాద్స్ ,ఏఎంబి వంటి మల్టీప్లెక్స్ లో బుకింగ్స్ కూడా ఈరోజు సాయంత్రం ఓపెన్ కానున్నాయి.
Video Advertisement
అయితే ఉన్నట్టు ఉండి సలార్ మూవీ అభిమానులకు పెద్ద షాకింగ్ న్యూస్ వచ్చింది. అదేంటంటే సలార్ సినిమా సౌత్ ఇండియాలో పలు థియేటర్లలో విడుదల కావడం లేదని తెలుస్తుంది. PVR Inox, మీరాజ్ సినిమాస్ లో సలార్ సినిమాని విడుదల చేసేందుకు సలార్ మేకర్స్ నిరాకరిస్తున్నారట.
ఉన్నట్టుండి ఇలా చేయడానికి గల కారణం ఏంటంటే నార్త్ ఇండియాలో సల్లర్ సినిమాస్ కి ఈ థియేటర్లలో సరైన స్క్రీన్స్ ఇవ్వడం లేదు. ఈ మల్టీప్లెక్స్ చైన్స్ అన్నిటిలోనూ షారుఖ్ ఖాన్ డంకి సినిమాని విడుదల చేస్తున్నారు. నార్త్ లో సరైన స్క్రీన్స్ ఇవ్వని కారణంగా సౌత్ లో కూడా ఈ థియేటర్లలో సలార్ సినిమాలు విడుదల చేయమని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ముందు నుండి సలార్ కి, డంకి కి మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. అయితే ఇది రోజురోజుకి ముదురుతూ వస్తుంది. ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో వేచి చూడాలి.
End of Article