సలార్, KGF, డీజే..! ఈ వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..!

సలార్, KGF, డీజే..! ఈ వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..!

by kavitha

Ads

పాన్ ఇండియా వైడ్ గా ప్రేక్ష‌కులు ఎంతో ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్న సినిమా ‘సలార్’. బాహుబ‌లితో ఇండియన్  బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించిన రెబల్ స్టార్ ప్ర‌భాస్ నటిస్తున్న సినిమా కావడంతో ‘సలార్’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కేజీఎఫ్ తో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాని తెరకెక్కిస్తుండడంతో ఈ మూవీ పై మరిన్ని అంచనాలు పెరిగాయి.

Video Advertisement

తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ అయ్యి, యూట్యూబ్ లో రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ టీజర్ లో  సలార్ మూవీకి, కేజీఎఫ్ కు కనెక్షన్ ఉంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో సలార్ రాఖీ భాయ్ కలిస్తే ఇలా ఉంటుందంటూ ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
salaar-kgf-connectionప్ర‌భాస్ హీరోగా న‌టిస్తోన్న తాజా పాన్ ఇండియా సినిమా ‘సలార్’. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీలో విలన్స్ గా మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 28న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రం పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. తాజాగా సలార్ టీజర్ రిలీజ్ అయ్యి, యూట్యూబ్ లో స‌రికొత్త రికార్డుల‌ను సృష్టించింది. స‌లార్ టీజ‌ర్ రిలీజ్ అయిన 24 గంట‌ల్లో 83 మిలియ‌న్ల వ్యూస్‌,  1.67 లైక్స్‌ వచ్చాయి.
Salaar-Teaserఈ టీజర్ లో ఉన్న క్లూస్ ను బట్టి ఈ మూవీకి కేజీఎఫ్ 2 మూవీకి కనెక్షన్ ఉంటుందని అంటున్నారు. కాబట్టి  ఈ మూవీలో రాఖీ భాయ్ పాత్ర కూడా ఉంటుందని అంటున్నారు. కేజీఎఫ్ 2 మూవీ క్లైమాక్స్ లో రాఖీ భాయ్ ఉన్న నౌక సముద్రంలో మునిగిపోతుందని తెలిసిందే. అయితే ఆ సీన్ తరువాత స‌లార్, రాఖీ భాయ్ ని కలిస్తే వారిద్దరు కలిస్తే  ఇలా ఉంటుందంటూ దువ్వాడ జగన్నాధం మూవీలోని ఒక సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో పై నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: “సలార్” టీజర్ తో పోలిస్తే.. ఆ అట్టర్ ఫ్లాప్ సినిమా టీజర్ 1000 రెట్లు బాగుందా..? ఏం మాట్లాడుతున్నారు..?


End of Article

You may also like