సలార్ సినిమాకి అక్కడ నష్టాలు తప్పవా… చూస్తే అదే అనిపిస్తుంది….!

సలార్ సినిమాకి అక్కడ నష్టాలు తప్పవా… చూస్తే అదే అనిపిస్తుంది….!

by Mounika Singaluri

Ads

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సల్మాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూలు సాధిస్తూ దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఈ సినిమా 600 కోట్ల పైబడి కలెక్షన్స్ సాధించింది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన సలార్ పార్ట్ 1 మంచి మాస్ హిట్ మూవీ ఆ పేరు తెచ్చుకుంది. బాలీవుడ్ లో షారుక్ ఖాన్ డంకి మూవీకి పోటీకి నిలబడి ఆ మూవీ కలెక్షన్స్ ను క్రాస్ చేసింది.

Video Advertisement

అయితే సలార్ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల నుండి 200 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. వీటిలో ఎక్కువ భాగం తెలంగాణ రాష్ట్రం నుండి రావడం గమనార్హం. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సలార్ మూవీకి నష్టాలు తప్పవని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

2023లో రిలీజైన తెలుగు సినిమాల్లో అత్యధిక షేర్ సాధించిన మూవీగా సలార్ నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ మూవీ రూ.124 కోట్ల షేర్ వసూలు చేసింది. అయినా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం నష్టాలు వచ్చే పరిస్థితి ఉండటం మింగుడు పడనిదే. తెలంగాణలో మైత్రీ మూవీ మేకర్స్ సలార్ ను డిస్ట్రిబ్యూట్ చేసింది. తెలంగాణలో రూ.65 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేయగా.. ప్రస్తుతం రూ.67 కోట్ల షేర్ వసూలు చేసింది.

salaar movie review

అంటే తెలంగాణలో ఇక నుంచి వచ్చేదంతా లాభమే అనుకోవాలి. కానీ ఏపీ పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ సినిమాకు 10 నుంచి 15 శాతం నష్టాలు తప్పేలా లేవని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఏపీలో సలార్ ప్రీరిలీజ్ బిజినెస్ రూ.55 కోట్లుగా ఉంది. కానీ సినిమా ఇప్పటికి కేవలం రూ.40 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది.

సోమవారంతో హాలీడే సీజన్ కూడా ముగిసింది. మంగళవారం నుంచి సలార్ ఆక్యుపెన్సీ క్రమంగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ మూవీకి పోటీగా పెద్ద సినిమా ఏదీ లేకపోయినా కూడా ఇప్పటికే 12 రోజులు కావడంతో ఇక సలార్ మానియా మెల్లగా తగ్గిపోనుంది. సంక్రాంతి సినిమాలో వచ్చేవరకు సలార్ కి డోఖా ఉండదు. ఈ లోగా మొత్తం కలెక్షన్స్ సాధిస్తుందేమో చూడాలి.


End of Article

You may also like