Ads
బాహుబలి ప్రభాస్ నటించిన సలార్ మూవీ థియేటర్లలో సంచలనం సృష్టించింది. రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కి సరైనా హిట్టు దక్కిందని ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇండియా వ్యాప్తంగా సలార్ సినిమా సూపర్ హిట్ అయింది.డిసెంబర్ 22న విడుదలైన ఈ పవర్ ప్యాక్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఏడు రోజుల్లోనే రూ. 550 కోట్ల కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. రాబోయే సంక్రాంతి సీజన్ వరకు పెద్ద సినిమాలేవీ రిలీజులకు నోచుకోవడం లేదు. దీంతో సలార్ వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది.
Video Advertisement
అయితే ప్రభాస్ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. అనుకున్న దాని కంటే ముందుగానే ప్రభాస్ సినిమా ఓటిటి లోకి రానున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ప్రముఖ ఓటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్ సలార్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. అయితే జనవరి 12నే ప్రభాస్ సినిమా ఓటిటి లోకి వస్తుందని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు దర్శనమిస్తున్నాయి. అయితే ఫ్లాప్ అయిన సినిమా నెల రోజుల్లోపు వస్తుందంటే పర్వాలేదు కానీ సూపర్ హిట్ అయ్యి థియేటర్లలో ఆడుతున్న సినిమా నెల తిరగకుండానే ఓటిటి లో వస్తుందంటే నమ్మశక్యంగా లేదు. దీనిని ప్రభాస్ ఫ్యాన్స్ కొట్టి పడేస్తున్నారు. దీనిపైన సలార్ సినిమా టీం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
End of Article