నార్త్ లో మొదలయిన సలార్ డామినేషన్…. డంకీ ఔట్….!

నార్త్ లో మొదలయిన సలార్ డామినేషన్…. డంకీ ఔట్….!

by Mounika Singaluri

Ads

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్స్ లో దూసుకుపోతుంది.

Video Advertisement

ప్రభాస్ కి తగ్గ సినిమా పడిందంటూ ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నార్త్ లో కూడా ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో అక్కడ అభిమానులను విపరీతంగా అలరిస్తుంది.

అయితే సలార్ కంటే ఒక రోజు ముందు షారుక్ ఖాన్ నటించిన డంకీ సినిమా కూడా విడుదలైంది. నార్త్ లో థియేటర్లన్నీ కూడా డంకీ సినిమాకే కేటాయించారు. మల్టీప్లెక్స్ లో కూడా అన్ని షోలు డంకీ సినిమాకి కేటాయించడంతో సలార్ నిర్మాతలు సీరియస్ అయ్యారు. దీంతో సౌత్ లో మల్టీప్లెక్స్ లకు తమ సినిమా ఇవ్వమంటూ డిసైడ్ అయ్యారు. దీంతో దిగి వచ్చిన మల్టీప్లెక్స్ ల వారు సలార్ కి కూడా కొన్ని థియేటర్లు కేటాయించారు.

salaar movie review

అయితే డంకీ సినిమాకి హిట్ టాక్ వచ్చిన కూడా ఎమోషనల్ కంటెంట్ అంటూ పేరు వచ్చింది. సలార్ సినిమా విడుదలైన తర్వాత నార్త్ లో పరిస్థితి మారిపోయింది. సలార్ సినిమా ముందు డంకీ సినిమా నిలబడలేకపోయింది. దీంతో నార్త్ లో మేజర్ థియేటర్లన్నీ డంకీ ని తీసేసి సలార్ ను ప్రదర్శించడం మొదలుపెట్టారు. ప్రభాస్ దెబ్బకి షారుక్ ఖాన్ నిలబడలేకపోయాడు అంటూ ప్రభాస్ అభిమానులు తెలివి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క దెబ్బతో సినిమా మొత్తం మారిపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.


End of Article

You may also like