భారత రాష్ట్రపతి జీతం ఎంతో తెలుసా..? అలాగే ఇతర సౌకర్యాలు ఏంటంటే..!?

భారత రాష్ట్రపతి జీతం ఎంతో తెలుసా..? అలాగే ఇతర సౌకర్యాలు ఏంటంటే..!?

by Anudeep

ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలలో భారతదేశం ఒకటి. అనేక సమాఖ్యలు, అనేక రాష్ట్రాలు, అనేక మతాలు, అనేక భాషలు, అనేక జాతులు దేశ ప్రథమ పౌరుని హోదాతో గౌరవించబడతారు. రాష్ట్రపతిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు.

Video Advertisement

రాష్ట్రపతి భారత సాయుధ దళాలకు కమాండర్-ఇన్-చీఫ్. కాబట్టి భారతదేశంలో రాష్ట్రపతి పదవికి ఉన్న ప్రాముఖ్యం మరే ఇతర పదవికి లేదు. రాష్ట్రపతికి లభించే జీతం, ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.. ఇప్పటికే ద్రౌపది ముర్ము అధిక మెజారిటీతో రాష్ట్రపతిగా గెలుపొందారు. దేశంలోనే అత్యున్నత స్థానమైన రాష్ట్రపతి స్థానాన్ని మొదటిసారి గిరిజన మహిళ ముర్ము సాధించారు.

ఈ క్రమంలో ప్రెసిడెంట్ కు ఎంత జీతం ఉంటుంది ఎలాంటి సౌకర్యాలు ఉంటాయనేది చాలామందిలో మెదులుతున్న ప్రశ్న. రాష్ట్రపతికి ప్రతి నెల ఐదు లక్షల రూపాయల జీతం వస్తుంది. అలాగే వైద్య, వసతి, ప్రయాణ సదుపాయాలు ఉచితంగా ఉంటాయి. భారత రాష్ట్రపతితో పాటు అతని లేదా ఆమె జీవిత భాగస్వామి ప్రపంచంలో ఎక్కడైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. దేశంలో అత్యధిక వేతనం కూడా రాష్ట్రపతికే ఉంటుంది.

2017 వరకు ఈ వేతనం లక్షన్నర మాత్రమే ఉండేది. 2018లో 5 లక్షలకు పెంచేశారు. జీతమే కాకుండా ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. ఢిల్లీలో 340 గదులు, తోటలు ఉన్న రాష్ట్రపతి భవన్ వారి అధికార నివాసం. అందులోనే బస చేస్తారు. సాధారణంగా రాష్ట్రపతి ప్రీమియం వాహనాల్లో తిరుగుతారు. బెంజ్ లాంటి అత్యాధునికమైన కార్లలో కట్టుదిట్టమైన జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తారు.

ప్రెసిడెంట్ ఉపయోగించే కారు.. బాంబులు, బుల్లెట్లు లాంటి వాటిని తట్టుకునేలా ప్రత్యేకంగా తయారు చేస్తారు. భారత ఆర్మీ విభాగంలోని ప్రత్యేక విభాగాలు రాష్ట్రపతికి బాడీ గార్డ్ గా ఉంటారు. వీరి రక్షణలో ఆర్మీ, వాయుసేన, నావికి చెందిన అగ్రశ్రేణి సైనికులు ఉంటారు. రాష్ట్రపతికి రెండు విడుదులు ఉన్నాయి. సమ్మర్ విడదీ సిమ్లాలో ఉంటే, శీతాకాలం విడిది హైదరాబాద్ బొల్లారంలో ఉంది.

 

రాష్ట్రపతి పదవీ విరమణ తర్వాత నెలకు 1.5 లక్షలు పెన్షన్ లభిస్తుంది. రాష్ట్రపతి జీవిత భాగస్వాములు, సెక్రటరీకి నెలకు రూ.30,000 పెన్షన్‌గా ఇస్తారు. ఒక అమర్చిన అద్దె రహిత బంగ్లా, రెండు ఉచిత ల్యాండ్‌లైన్లు, మొబైల్ ఫోన్, ఐదుగురు వ్యక్తిగత సిబ్బంది, సిబ్బంది ఖర్చులు సంవత్సరానికి రూ. 60,000. రైలు లేదా విమానంలో ఉచిత ప్రయాణం ఉంటుంది.


You may also like