సిద్ధార్థ్ ను అలా వదిలించుకున్నా…లేకుంటే సావిత్రిలా.? ఆ టైం లో చైతు నాకు..!

సిద్ధార్థ్ ను అలా వదిలించుకున్నా…లేకుంటే సావిత్రిలా.? ఆ టైం లో చైతు నాకు..!

by Anudeep

Ads

“మోస్ట్ డిజైరబుల్ ఉమన్ -2019” టాప్ వన్ ప్లేస్ నాకు దక్కడం ఆనందంగా ఉంది, ఆశ్చర్యంగా కూడా ఉంది ఇది సమంత కామెంట్. పెళ్లయిన నాకు రావడం ఆశ్చర్యం కలిస్తుంది అనేది సమంతా మాటల అర్దం. ఆడవాళ్లకు పెళ్లయింది అంటే వాళ్ల క్రేజ్ తగ్గిపోతుంది. సినిమా వాళ్ళకైతే అవకాశాలు తగ్గిపోతాయి. అందుకే పెళ్ళి తర్వాత హీరోయిన్లు సినిమాలకు దూరంగా ఉంటారు. కాని సమంత విషయంలో మాత్రం అంతా రివర్స్ గా జరుగుతోంది.

Video Advertisement

ఏ మాయ చేశావే సినిమాతో సంపాదించుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ చైతూ తో పెళ్లి తర్వాత మరింత రెట్టింపయ్యింది. దానికి కారణం పెళ్లి తర్వాతే విభిన్నమైన పాత్రలని ఎంచుకుంటోంది, నటనలో పరిణతి కనపరుస్తోంది . దానికి తోడు చైతూతో వివాహబంధం, వారి ప్రేమ కూడా ఫ్యాన్స్ కి ముచ్చటగా ఉంటుంది. ఒకవైపు సినిమా లైఫ్ మరో వైపు ఫ్యామిలి లైఫ్ ని చక్కగా లీడ్ చేస్తోంది.

సమంతా ఎంత అల్లరిగా ఉంటుందో, అంతే బాధ్యతగా కూడా ఉంటుందనేది తన నటన, రెగ్యులర్ లైఫ్ మరియు తన సోషల్ లైఫ్ చూస్తే ఇట్టే అర్దమైపోతాయి .అంత బాధ్యతాయుతమైన వ్యక్తి కాబట్టే తన లైఫ్ గురించి ఫర్ఫెక్ట్ డెసిషన్ తీస్కుందేమో. అదేనండి చైతూతో ప్రేమకి ముందు నటుడు సిధ్దార్ద్ , సమంతా ప్రేమించుకున్నారని, పెళ్లికోసం శ్రీశైలంలో పూజలు చేశారని విషయం అందరికి తెలిసిందే, ఈ విషయాన్ని దాచిపెట్టాలని సమంతా ఎప్పుడూ అనుకోలేదు.

హీరోయిన్స్ అన్నాక ఎఫైర్స్ కామన్, వాటిని వాళ్లు దాచిపెట్టడం లేదా దాటవేయడం మామూలు విషయమే, కాని సిద్దూతో రిలేషన్షిప్ గురించి కుండబద్దలు కొట్టినట్టు చెప్తుంది సమంత. అదే విషయాన్ని ఇటీవల ఒక ఇంటర్వూలో అడిగిన ప్రశ్నకి ఇలా సమాధానం ఇచ్చింది…

”సిద్దూతో ప్రేమలో ఉన్నది నిజం , కాని ఆ రిలేషన్ అలాగే కంటిన్యూ అయ్యుంటే నేను మరో సావిత్రిలా మిగిలిపోయేదాన్ని. అందుకే వీలైనంత తొందరగా ఆ బంధం నుండి బయటపడ్డాను . కొత్త జీవితాన్ని జీవించాలని నిర్ణయించుకున్నాను. ఆ టైంలో చైతూ తోడుగా నిలిచాడు . చైతూ నాకు దేవుడిచ్చిన వరం” అని చెప్పుకొచ్చింది.

పెళ్ళైన తర్వాత సామ్ చేసిన ఈ వాఖ్యలు అందరిలోనూ ఆసక్తిని రేపాయి. మరో వైపు దటీజ్ సామ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు . నిజానికి ఒక బంధంలోనుండి బయటపడీ, అది కూడా నిత్యం వార్తల్లో ఉండే వ్యక్తి ఆ బంధాన్ని తెంచుకుని బతకాలని నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం.

ఎందుకంటే ఎప్పుడు సందు దొరుకుతుందా పొడుచుకుతిందామా అని కాచుకూర్చుంటుంది మన మీడియా . ఎన్నో కామెంట్స్ కి ఎదురు నిలపడాల్సి ఉంటుంది, మరెన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అయినా దేనికి భయపడకుండా ఈ ఇష్యూకి చెక్ పెట్టిన సామ్ నిజంగానే గ్రేట్.


End of Article

You may also like