Home Filmy Adda “ఇంకొక్క అడుగు కూడా ముందుకి వెయ్యలేను అనిపించేది అంటూ”… ఎమోషనల్ అయిన “సమంత”..!

“ఇంకొక్క అడుగు కూడా ముందుకి వెయ్యలేను అనిపించేది అంటూ”… ఎమోషనల్ అయిన “సమంత”..!

by Anudeep

ప్రముఖ సినీ నటి సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆమెకు మనో ధైర్యాన్ని ఇస్తూ అభిమానులు, సెలెబ్రిటీలు వరుసగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన అనారోగ్యంపై మాట్లాడిన సమంత భావోద్వేగానికి గురయ్యారు.

 

సమంత తన తాజా చిత్ర యశోద ప్రమోషన్‌లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ‘‘నేను నా పోస్టులో చెప్పినట్టుగా కొన్ని రోజులు మంచిగా ఉంటాయి. కొన్ని రోజులు చెడుగా ఉంటాయి. ఒక్కొక్క రోజైతే ఇంకో అడుగు ముందుకు వేయలేనని అనిపిస్తోంది. కానీ కొన్నిసార్లు తిరిగి చూస్తుంటే ఇన్ని దాటేసి వచ్చానా? అనిపిస్తుంది’’ అని సమంత ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ సమయంలో ఆమె భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు.

samantha gets emotional about the situations around her..

‘‘నేను ఒక్క దానినే కాదు. చాలా మంది ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నవారు ఉన్నారు. నేను చాలా ఆర్టికల్స్ చూశారు. నాకు ప్రాణాపాయం అని రాస్తున్నారు. ప్రస్తుతానికైతే నేను చావలేదు. కానీ ఈ జర్నీ కష్టం గా ఉంది. నేను పోరాడతాను. గెలుస్తాను ’’ అని సమంత చెప్పారు.

samantha gets emotional about the situations around her..

మయోసైటిస్ అనే వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో.. భరించడం ఎంత కష్టమో మనం ఇప్పటికే తెలుసుకున్నాం. కనీసం లేచి నిల్చోవడం, నడవడం కూడా కష్టంగా మారుతుందట. ఎంతో అలసటగా ఉంటుందట. అలా సమంత ఇప్పుడు ఈ వ్యాధి కోసం చికిత్స తీసుకుంటోంది. అయినా కూడా తన యశోద సినిమా కోసం ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటుంది సమంత.

You may also like