హోటల్ ఓపెనింగ్ కి వచ్చి ఎమోషనల్ అయిన సమంత…వీడియో మీరే చూడండి!

హోటల్ ఓపెనింగ్ కి వచ్చి ఎమోషనల్ అయిన సమంత…వీడియో మీరే చూడండి!

by Anudeep

Ads

ఏం మాయ చేసావే లో జెస్సీగా అందరి మనసుల్ని దోచుకున్న సమంత ఒకవైపు ఉన్నతనటిగా ఎదుగుతూ, మరోవైపు వ్యక్తిత్వంలోనూ తనది ఉన్నతమే అని చాటుతోంది.  సమాజసేవ చేయడానికి ముందుండడమే కాదు, తన అసిస్టెంట్ ప్రగతికి కూడా తోడ్పడుతుంది. తన అసిస్టెంట్ ఆర్య న్యూ రెస్టరెంట్ “హెల్తీ వే” ఓపెనింగ్ కి వచ్చిన సమంత, నన్ను అమ్మానాన్నలా చూసుకున్నడని చెప్తూ మురిసిపోయింది.

Video Advertisement

సమంతా అక్కినేని ‘ప్రత్యూష సపోర్ట్’ అనే ఓ ఎన్ జి ఓ ను నడుపుతూ , బలహీన వర్గాలకు చెందిన పిల్లలకు కావాల్సిన వైద్య, విద్య ఖర్చులను భరిస్తూ చాలా కుటుంబాలకు సాయంగా నిలబడింది. ఇప్పటికీ తన వంతుగా సాయం చేస్తూనే ఉంది. ఇప్పుడు తన అసిస్టెంట్ ఆర్య స్టార్ట్ చేసిన హెల్తీ వే రెస్టారెంట్ ని ప్రారంభించి అతన్ని ప్రశంసల్లో ముంచెత్తింది . సోషల్ మీడియాలో వైరలవుతున్న ఈ టాపిక్ తో సమంతా నెటిజన్ల మనసుని మరోసారి దోచుకుంది.

ఈ సంధర్బంగా సమంతా ఏం చెప్పిందో తన మాటల్లోనే “ ఇవాళ నాకు ఎంతో ప్రత్యేకమైన రోజు . ఆర్య  నా కుటుంబ సభ్యుడిలాంటివాడు. ‘ఏమాయ చేసావె’ చివరి షెడ్యూల్‌ నుంచి నా అసిస్టెంట్‌.సుమారు పదకొండేళ్లుగా నాతోనే ఉన్నాడు. నేను ఇప్పుడు ఇంత ఆరోగ్యంగా ఫిట్ గా ఉన్నానంటే కారణం ఆర్యనే, చలిలో గానీ ఎండ గానీలో, బాధ సంతోషంలో గానీ.. నాతోనే ఉన్నాడు. అంతేకాదు నన్ను మా అమ్మానాన్న కంటే బాగా చూసుకున్నాడు అని తన అసిస్టెంట్ ఆర్య గురించి చెప్పింది.

“రాజోలు నుండి జపాన్ వరకు నాతో ప్రయాణం చేశాడు. మొదట నా దగ్గరకి వచ్చినప్పుడు కనీసం కాఫీ పెట్టడం వచ్చేది కాదు. అలాంటిది నేను ఎక్కడికి వెళ్తే అక్కడకి వస్తూ, అక్కడ దొరికే ఇంగ్రిడియంట్స్ తోనే నాకు టేస్టీ ఫూడ్ చేసి పెట్టేవాడు. ఇప్పుడు సొంతంగా ఒక రెస్టారెంట్ పెట్టే స్థాయికి చేరాడు . చాలా సంతోషంగా ఉంది , ఆర్యలో ఒక ఫైర్ ఉంటుంది , తను అసిస్టెంట్ గానే ఆగిపోవాలని కోరుకోడు . ఇంకా పై స్థాయికి చేరుకోవాలని ఆరాటపడుతుంటాడు. తను అనుకున్న స్థానానికి చేరాలని, ఆర్య విజయం సాధించాలనీ కోరుకుంటున్నా’’ అని చెప్పుకొచ్చింది.

అంతేకాదు ఆర్య ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేసినా సరే , ఒకవైపు రెస్టారెంట్ ని చూస్కుంటూ నన్ను కూడా వదిలేయకుండా ఉండాలని అంది . తమ దగ్గర పనిచేసే వాళ్లని తమ దారిన తమని వదిలేస్తుంటారు చాలామంది . కానీ వారి ఉన్నతిని కోరుకునే వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు . తన అసిస్టెంట్ ప్రగతిని మెచ్చుకుంటూ తనకి తోడున్న సమంతాని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు నెటిజన్లు .

watch video:


End of Article

You may also like