Ads
చై సామ్ విడాకులు తీసుకున్న వార్త సోషల్ మీడియా ను హోరెత్తించింది. గత మూడు, నాలుగు రోజుల పాటు ఆమె విడాకులు తీసుకున్న తాలూకు వార్తలే సోషల్ మీడియా లో హల్ చల్ చేసాయి. విడాకులు తీసుకున్న తరువాత.. సమంత సోషల్ మీడియా లో ఓ పోస్ట్ చేసింది. తాను కలలు గన్న దానికోసం కష్టపడాలని, ఇలా నిద్రపోతూ ఉండకూడదని తన పోస్ట్ లో పేర్కొంది.
Video Advertisement
ఎంతో ముచ్చటైన జంట చై-సామ్. కానీ వారి బంధం ఇలా విడిపోతుందని ఎవరు ఊహించలేదు. ఈరోజు వారి పెళ్లి రోజు. అక్టోబర్ 6 న హిందూ సంప్రదాయంలో, 7 న క్రిస్టియన్ సంప్రదాయం లో పెళ్లి చేసుకున్నారు. ఈరోజు సమంత తన వర్క్ గురించి కొత్త అప్ డేట్ పోస్ట్ చేసారు. లక్మి ఫ్యాషన్ వీక్ కోసం ఆమె తీసుకున్న ఫోటో షూట్ లో ఓ తన ఫేవరెట్ ఫోటో ను సోషల్ మీడియా లో పంచుకున్నారు.
ఈ ఫోటో ను పోస్ట్ చేసి ఓ కవిత్వాన్ని కూడా రాసేసింది. “పాత ప్రేమ పాటలు – పర్వతాలు మరియు శిఖరంపై శీతాకాలపు గాలి ధ్వని, కోల్పోయిన మరియు దొరికిన చిత్రాల పాటలు. లోయలో మెలంచోలిక్ ప్రతిధ్వని ధ్వని మరియు పాత ప్రేమికుల పాటలు. పాత బంగ్లాలు, మెట్ల మార్గాలు మరియు సందులలో గాలి శబ్దం.” అంటూ కాప్షన్ లా కవిత్వాన్ని జత చేసింది..
View this post on Instagram
End of Article