సమంత రూత్ ప్రభు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది. దీంతో ఆమెకు ఏమైంది అని అభిమానుల్లో ఆందోళ నెలకొంది. మధ్యలో సామ్ ఎక్కడో పూజలు చేస్తున్నట్లుగా లీక్ అయిన ఫోటో లో కూడా చాలా నీరసం గా కనిపించటం తో సామ్ కి ఏమైందంటూ అభిమానులు కంగారు పడ్డారు.

Video Advertisement

అయితే సమంత కు గతం లో ఒక స్కిన్ ప్రాబ్లెమ్ వచ్చింది. దానికి సంబంధించి సామ్ సర్జరీ చేసుకుందని, అందుకే బయటకు రాలేదని అందరూ అనుకున్నారు. కానీ తన హెల్త్ ప్రాబ్లెమ్ గురించి సామ్ ఈ రోజు సోషల్ మీడియా లో వెల్లడించింది.

samantha opens up about her health issue..
తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో ఆమె ఎడమ చేతికి కాన్యులాతో ఉన్న చిత్రాన్ని షేర్ చేసింది. తనకు మైయోసిటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది అని సామ్ ఆ పోస్ట్ లో వెల్లడించింది.

samantha opens up about her health issue..
“యశోద సినిమా ట్రైలర్‌కు వచ్చిన ఇచ్చిన రెస్పాన్స్ చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. అదే మీకు, నాకు మధ్య ఉన్న బంధం. అదే ప్రేమతో నేను ఈ కష్టాలన్నింటిని ఎదుర్కొంటున్నాను. నా మీద విసిరే రాళ్లను కూడా తట్టుకుంటున్నాను. మైయోసిటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నాను. ఇదంతా మీకు చెప్పాలని అనుకున్నాను.
కానీ కాస్త ఆలస్యంగా చెబుతున్నాను. మనకు ఎదురయ్యే సవాళ్లను అంగీకరిస్తూ ముందుకు వెళ్లాల్సిందే. త్వరలోనే కోలుకుంటానని వైద్యులు చెప్పారు. మానసికంగా, శారరీకంగా నేను ఎన్నో కష్టాలను చూశాను.. గతం లో నేను భరించలేననేంత స్థాయిలోనూ కష్టాలు వచ్చాయి.. కానీ అవన్నీ ఎలాగో గడిచిపోయాయి. ఇక ఇది కూడా త్వరలోనే సమసిపోతుందని ఆశిస్తున్నాను..” అని సమంత ఆ పోస్ట్ లో చెప్పుకొచ్చింది.

samantha opens up about her health issue..
ఇక సమంత వేసిన ఈ పోస్ట్ చూసి అభిమానులు కంగారు పడుతున్నారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండని సమంతకు సూచిస్తున్నారు. పలువురు ప్రముఖులు కూడా సామ్ కు ధైర్యం చెబుతున్నారు. ఇకపోతే మైయోసిటిస్ వ్యాధిలో కండరాల బలహీనత, ఎక్కువ సేపు నిల్చోలేకపోవడం నడవ లేకపోవడం, నీరసంగా ఉండటం అనేవి లక్షణాలు అని తెలుస్తోంది.