సమంత దగ్గరున్న ఈ 5 లగ్జరీ కార్ల గురించి తెలుసా.? ఖరీదు ఎంతంటే.?

సమంత దగ్గరున్న ఈ 5 లగ్జరీ కార్ల గురించి తెలుసా.? ఖరీదు ఎంతంటే.?

by Anudeep

Ads

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీలలో సమంత ఒకరు. తన సినిమాలకు సంబంధించిన విషయాలను కానీ, లేదా ఇతర విషయాలను కానీ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.

Video Advertisement

అలాగే చాలా సార్లు తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమంత సోషల్ మీడియా ద్వారా సమాధానం చెప్పారు. ఇవన్నీ మాత్రమే కాకుండా ఎంతో మందిని ప్రోత్సహించేలాగా కూడా సమంత పోస్ట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం సమంత వరుస సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు.

samantha 1

నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత సినిమా వరుస షూటింగ్ లతో మరింత బిజీగా ఉండేలా చూసుకుంటున్నారు. పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసిన తరువాత ఆమెకు పాపులారిటీ మరింత పెరిగింది అని చెప్పొచ్చు. సమంత ట్రేండింగ్ లో ఉంటూ తన కెరీర్ ని మరింత అద్భుతంగా మలుచుకుంటూ వచ్చారు. టాలీవుడ్ లోనే కాకుండా.. ఇటు బాలీవుడ్ , అటు హాలీవుడ్ లో కూడా మంచి పేరు తెచ్చుకునేలా సమంత తన కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో ఆమె నటించిన శాకుంతలం సినిమా విడుదల సిద్ధం కాబోతున్న సంగతి తెలిసిందే.

samantha 2

ఇది కాకుండా మరో రెండు ద్విభాషా సినిమాల్లో ఆమె నటిస్తున్నారు. అది కాకుండా యశోద షూటింగ్ ను స్టార్ట్ చేసారు. ఇది కాకుండా మరో ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ లో కూడా సమంత నటిస్తున్నారు. సంపాదన విషయంలోనూ, సేవ చేసే విషయంలోనూ ముందుండే సమంత ఓ ఆరు లగ్జరీ కార్లను సొంతం చేసుకున్నారట. వాటి ఖరీదు కూడా కోట్లలోనే ఉంటుంది. ఇంతకీ ఆ కారులేంటో చూసేద్దామా..

samantha 3

స్వాంకీ పొర్చే కేమన్ కారుని సమంత సొంతం చేసుకున్నారు. దీని ఖరీదు 1 .46 కోట్ల రూపాయలు ఉంటుందట. అలాగే 72 లక్షల విలువైన జాగ్వార్ ఎఫ్ ఎక్స్ ను కూడా సామ్ సొంతం చేసుకున్నారు. 83 లక్షల ఆడి క్యూ 7 కారు, 2.26 కోట్ల రేంజ్ రోవర్ తో పాటు 1.42 కోట్ల విలువ చేసే మెర్సిడెజ్ బెంజ్ కార్ ను కూడా సమంత సొంతం చేసుకున్నారట.


End of Article

You may also like