Ads
ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న టాపిక్ పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు.అంతే కాకుండా ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా.
Video Advertisement
ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ అల్లు అర్జున్, సుకుమార్ కలిసి చేస్తున్న సినిమా పుష్ప. దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా డిసెంబర్ 17 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతంలో సమంత నర్తిస్తున్నారు అంటూ తాజాగా పుష్ప యూనిట్ ప్రకటించింది. దీనితో.. ఈ విషయం నెట్టింట్లో చర్చనీయాంశం అయింది. అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఈ పాట కోసం ప్రత్యేకంగా సెట్ వేసి షూట్ చేస్తారని తెలుస్తోంది. ఈ పాట కోసం సమంత ఏకంగా కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్.
End of Article