Ads
ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షుకులకి పరిచయం అయిన సమంత అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు…ఇటు తెలుగు,అటు తమిళ్ ఇండస్ట్రీ ని ఏలుతున్న సమంతా అక్కినేని వారసుడు ‘నాగ చైతన్య’ ని పెళ్లి చేసుకున్న తరువాత కూడా తన సినీ ప్రస్థానాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు..సమంత గారు సినిమాలతోనే ప్రేక్షకులకి దగ్గరవడమే కాకుండా..సామాజిక సేవలోను తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు.
Video Advertisement
ప్రత్యుష ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సామజిక సేవ ఆమెను మరింత ఎక్కువగా అభిమానించేలా చేసుకున్నారు..అంతే కాదు తెలంగాణ చేనేత కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు.కరోనా వైరస్ మహమ్మారి కారణంగా లాక్ డౌన్ వలన షూటింగ్స్ అన్ని రద్దుకావడం.సెలెబ్రెటీలు అందరూ హోమ్ క్వారంటైన్ లో ఉండడం తో…ఎవరికి తోచిన టాలెంట్ తో వాళ్ళు…అభిమానులకి మరింత చేరువ అవుతున్నారు.
ప్రస్తుతం సమంత కూడా తనలోని టాలెంట్ ని ఈ లాక్ డౌన్ లో ఉపయోగించుకున్నారు.ఎలాగంటే సమంత,నాగ చైతన్యలకు హైదరాబాద్ లో సొంత ఇల్లు ఉంది..అదే ఇంటిపైన కూరగాయలను పండిస్తున్నారు వీటితో పాటు పలు పండ్లను సైతం పండిస్తున్నారు..ఆరోగ్యం మీద ఎంతగానో శ్రద్ధ చూపించే సమంతా తన పంట ద్వారా పండిన కూరగాయాలనే ఇంటికి ఉపయోగించుకోవాలని అనుకున్నారు..ఇటీవలే ఈ విషయాన్నీ స్వయంగా ప్రకటించారు.ఎంతయినా మా సమంత భేష్ అందరికి ఆదర్శం అంటూ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు ఫాన్స్.
End of Article