36 ఏళ్ళ సమంత.. 72 ఏళ్ళ స్టార్ హీరో పక్కన నటించబోతున్నారా.? ఏ పాత్రలో.?

36 ఏళ్ళ సమంత.. 72 ఏళ్ళ స్టార్ హీరో పక్కన నటించబోతున్నారా.? ఏ పాత్రలో.?

by Mohana Priya

Ads

ఏ మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన హీరోయిన్ సమంత. ఆ తర్వాత అగ్ర హీరోలు అందరితోనూ నటించి స్టార్ హీరోయిన్ అయ్యారు. ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేసి హిట్ కొట్టారు. సమంత కొన్ని సంవత్సరాల నుండి కేవలం సెలెక్టివ్ సినిమాలు మాత్రమే చేస్తున్నారు. నటనకి ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే ఎంచుకుంటున్నారు. ఇప్పుడు సమంత సిటాడెల్ సిరీస్ చేశారు.

Video Advertisement

అమెజాన్ ప్రైమ్ లో కొన్ని రోజుల్లో ఈ సిరీస్ విడుదల అవుతుంది. యాక్షన్ ఓరియంటెడ్ పాత్రని ఈసారి సమంత చేశారు. ఇందుకోసం చాలా కసరత్తులు కూడా చేశారు. అయితే, సామాజిక మాధ్యమాల్లో సమంత చాలా యాక్టివ్ గా ఉంటారు. సమాజానికి తన వంతు కృషి చేయడానికి ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సహాయం చేశారు. అంతే కాకుండా, ఇప్పుడు టేక్ 20 పేరుతో ఒక పాడ్ కాస్ట్ మొదలుపెట్టి, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల మీద కూడా అవగాహన కల్పించడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నారు.

samantha to act with this senior hero

మరొక పక్క, బ్రాండ్ ప్రమోషన్స్ చేయడంతో పాటు, ఎడ్వర్టైజ్మెంట్స్ లో కూడా కనిపిస్తూ ఉన్నారు. అయితే, సమంత ఇప్పుడు ఒక సీనియర్ హీరోతో నటిస్తున్నారు అనే ఒక వార్త బయటకు వచ్చింది. అందులో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియదు. ఆ హీరో వయసు 72 సంవత్సరాలు. వీళ్ళిద్దరూ కలిసి ఇటీవల ఒక ప్రకటనలో నటించారు. సమంత, మలయాళ స్టార్ హీరో మమ్ముట్టితో కలిసి ఒక ప్రకటనలో నటించారు.

samantha to act with this senior hero

అయితే, మమ్ముట్టి తన సినిమాలో సమంతకి అవకాశం ఇచ్చినట్టు ఒక వార్త వచ్చింది. కానీ ఏ పాత్రకి అవకాశం ఇచ్చారు అనేది తెలియదు. ఈ విషయం నిజమా? కాదా? అనేది కూడా ఇంకా ఎవరికీ తెలియదు. ఒకవేళ నిజమే అయితే కనుక ఈ విషయం మీద ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సమంత కేవలం నటనకి ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తున్నారు కాబట్టి, ఒకవేళ సమంత సెలెక్ట్ చేస్తే ఆ పాత్ర కచ్చితంగా మంచి పాత్ర అయ్యి ఉంటుంది.

ALSO READ : పెళ్ళైన 13 రోజులకే అలా చేసేవాడు…విజయ్ చనిపోయాక అసలు ఏం జరిగిందో చెప్పిన కమెడియన్ భార్య.!


End of Article

You may also like