Home Filmy Adda అప్పుడు సమంతనే కావాలన్నారు.. ఇప్పుడేమో వద్దంటున్నారు.. అసలు కారణం ఏంటంటే..?

అప్పుడు సమంతనే కావాలన్నారు.. ఇప్పుడేమో వద్దంటున్నారు.. అసలు కారణం ఏంటంటే..?

by Anudeep

అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియా సినిమా పుష్ప. పుష్ప సినిమా అల్లు అర్జున్ కి మంచి హిట్ ని తీసుకు వచ్చింది. ఇందులో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా కనిపించారు. అల వైకుంఠపురం తర్వాత మంచి బ్లాక్ బస్టర్ ని బన్నీకి ఈ సినిమా తీసుకువచ్చింది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా పుష్ప.

డిసెంబర్ 17న పుష్ప సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతోంది. పైగా ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది. అల్లుఅర్జున్ యాక్టింగ్ కి ఎంతోమంది ఫిదా అయిపోయారు.

samantha poster from pushpa special song

ఇక ఈ సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ కూడా చాలా ప్రత్యేకంగా నిలిచింది. అసలు ఈ ఐటెం సాంగ్ సమంత ఒప్పుకుంది అన్న వార్తే చాలా సెన్సేషన్ అయ్యింది. సమంత ఒప్పుకుందని తెలియడంతో.. ఈ సాంగ్ కోసం అభిమానులు చాలానే ఎదురు చూసారు. తీరా ఆ సాంగ్ రిలీజ్ అయ్యాక… ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది.

netizens recalling samantha tweet on 1 nenokkadine poster

ఆ సాంగ్ వల్ల కూడా సినిమాకి చాలానే హైప్ వచ్చింది. అసలు ఈ స్పెషల్ సాంగ్ కోసం సుకుమార్ ఎవరినైనా బాలీవుడ్ భామని తీసుకోవాలని అనుకున్నారట. ఎవరి వల్ల సాంగ్ కి హైప్ వస్తుంది..? అని తెగ ఆలోచించేసాడట. బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకోవాలని, ఎవరిని తీసుకోవాలి అని తెగ చర్చించారట. అప్పటికి సమంత లైమ్ లైట్ లో ఉంది. సమంత ఏమి చేసినా సెన్సేషన్ అవుతుంది అని భావించి.. సమంత ఐటెం సాంగ్ వద్దు అనుకున్నా.. ఈ సాంగ్ కోసం ఒప్పించారట.

pushpa oo antava song copied from copied from famous suriya song

అనుకున్నట్లే.. సమంత వల్ల ఈ పాటకి చాలానే హైప్ వచ్చింది. ఇక సెకండ్ పార్ట్ లో కూడా ఓ ఐటెం సాంగ్ ఉంటుందట. దీనికి మాత్రం సమంత చేయరట. మరోవైపు పుష్ప హిందీ లో కూడా మంచి విజయం సాధించడంతో.. ఇందులో నర్తించడానికి బాలీవుడ్ భామలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారట. ఈ లెక్కన “పుష్ప.. ది రూల్” లో స్పెషల్ సాంగ్ కి ఎవరైనా బాలీవుడ్ హీరోయిన్ నర్తించే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

You may also like