సమరసింహారెడ్డి మూవీ ఎన్ని థియేటర్స్ లో రీరిలీజ్ అవుతుందో తెలుసా..? రీరిలీజ్ లో రికార్డ్ ఇదే.!

సమరసింహారెడ్డి మూవీ ఎన్ని థియేటర్స్ లో రీరిలీజ్ అవుతుందో తెలుసా..? రీరిలీజ్ లో రికార్డ్ ఇదే.!

by kavitha

Ads

టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. మార్చి మొదటి వారంలో స్టార్ హీరోల సినిమాలు రీరిలీజ్ అవుతున్నాయి. వాటిలో నటసింహం నందమురి బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి కూడా ఉంది. ఈ చిత్రం అప్పట్లో రిలీజ్ అయ్యి, సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Video Advertisement

బాలకృష్ణ, దర్శకుడు బి.గోపాల్ కాంబోలో తెరకెక్కిన సమరసింహారెడ్డి మూవీ బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.  ఈ మూవీ రికార్డ్ స్థాయిలో వసూళ్లను సాధించి ప్రొడ్యూసర్లకు లాభాలను అందించింది. తెలుగులో వచ్చిన ఫ్యాక్షన్ చిత్రాలలో ఈ మూవీ సెన్సేషన్ గా నిలిచింది. మార్చి2 న ఈ సినిమా రీరిలీజ్ కానుంది.
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించగా, సిమ్రాన్, అంజలా ఝవేరి, సంఘవి హీరోయిన్లుగా నటించారు. జయ ప్రకాష్ రెడ్డి విలన్ గా నటించారు. ఈ చిత్రానికి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. ఈ చిత్రం అప్పట్లో29 సెంటర్లలో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. బాలకృష్ణ కెరీర్ లో ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలవడమే కాకుండా పలు రికార్డులను బ్రేక్ చేసింది. ఈ మూవీ విడుదల అయ్యి  25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మార్చి2 న ఈ మూవీని రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటకలో రీరిలీజ్ థియేటర్స్ సంఖ్య కూడా ఎక్కువగానే ఉండనుంది.

నైజాంలోనే 100 దాకా స్క్రీన్స్ లో విడుదల చేయనున్నారు. ఆంధ్రలో 250 వరకు స్క్రీన్స్ లో రీరిలీజ్ కాబోతుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 350 వరకు స్క్రీన్స్ లో రీ రిలీజ్ చేయనుండగా, కర్ణాటక మరియు ఇతర ప్రాంతాలలో కలిపి 50 వరకు స్క్రీన్స్ లో రీరిలీజ్ కి రెడీ అవుతుంది. దాంతో మొత్తం 400 వరకు స్క్రీన్స్ లో రీ రిలీజ్ కానుంది.  ఈ మూవీ రీ రిలీజ్ లో మంచి వసూళ్లను సాధిస్తుందన్న నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. రీరిలీజ్ లో ఈ మూవీ వసూళ్లు ఎలా ఉండనున్నాయో వేచి చూడాలి.

Also Read: రిలీజ్ అయిన 5 ఏళ్ల తర్వాత OTT లోకి వచ్చిన ఈ సినిమా చూసారా.? కామెడీ మాములుగా లేదుగా.?


End of Article

You may also like