రీమేక్ కాదు.. కానీ ఒకే కథ ఆధారంగా 8 సినిమాలు వచ్చాయని మీకు తెలుసా..?

రీమేక్ కాదు.. కానీ ఒకే కథ ఆధారంగా 8 సినిమాలు వచ్చాయని మీకు తెలుసా..?

by kavitha

Ads

ఒక మూవీ సూపర్ హిట్ అయితే ఆ సినిమాను ఇతర భాషలలో రీమేక్ చేయడం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తారు. అయితే ఒకే కథతో వివిధ భాషల్లో డిఫరెంట్ చిత్రాలను చేయడం, ఆ చిత్రాలన్నీ విజయం సాధించడం చాలా అరుదుగా  జరుగుతుంది.

Video Advertisement

అలాంటి స్టోరీలు భారతీయ సినీ ఇండస్ట్రీలో అతి తక్కువ అని చెప్పుకోవచ్చు.  అయితే అటువంటి స్టోరీలలో ఒక కథను బేస్ చేసుకుని వివిధ భాషలలో  తెరకెక్కిన సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఒకే స్టోరీతో కోలీవుడ్ లో ఒకటి, టాలీవుడ్ లో నాలుగు, కన్నడలో ఒకటి, బాలీవుడ్ లో  రెండు చిత్రాలు తెరకెక్కాయి. అయితే ఈ చిత్రాలు ఏది కూడా ఇంకో సినిమాకు రీమేక్ కాదు. అన్ని సినిమాలు విజయం సాధించాయి. ఈ కథను సినిమాగా మలిచిన మొదటి వ్యక్తి తమిళ సీనియర్ దర్శకుడు కె.భాగ్యరాజ్.  ఆయన కన్నడ నవల ‘అర్థాంగి’ కథను మూవీకి తగినట్లుగా రాసుకుని, ‘ఎంగ చిన్న రస’ అనే చిత్రాన్ని తమిళంలో తీశారు. ఈ చిత్రంలో భాగ్యరాజా, రాధ జంటగా నటించగా, సూపర్ హిట్ గా నిలిచింది.

ఇదే సినిమాని  తెలుగులో ‘చిన్నరాజా’ పేరుతో  డబ్‌ చేసి రిలీజ్ చేయగా, విజయం సాధించింది.ఆ తర్వాత ఇదే కథతో  బాలీవుడ్ లో అనిల్‌కపూర్‌, మాధురి దీక్షిత్‌ జంటగా ‘బేటా టైటిల్ తో ఒక సినిమా రిలీజ్ అయ్యి, విజయం సాధించింది. ఆ మూవీ రైట్స్‌ను తెలుగు దర్శకుడు  ఇ.వి.వి సత్యనారాయణ సొంతం చేసుకుని, తెలుగులో ‘అబ్బాయిగారు’ సినిమా తీశారు. వెంకటేష్, మీనా జంటగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది.

అయితే అప్పటికే ఇదే కథతో వచ్చిన చిన్న రాజా సినిమా తెలుగులో రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ అయ్యింది. మళ్ళీ అదే స్టోరీతో తెరకెక్కిన అబ్బాయిగారి మూవీని కూడా ఆడియెన్స్ హిట్ చేశారు. ఆ తరువాత కన్నడ దర్శకుడు డి రాజేంద్ర బాబు కథతో ‘అన్నయ్య’ టైటిల్ తో సినిమా తీసి, హిట్ అందుకున్నారు. అలా ఒకే కథతో మొత్తం 8 సినిమాలు తెరకెక్కి, విజయం సాధించాయి.

Also Read: OTT లో వచ్చాక “గుంటూరు కారం”లో ఈ తప్పుని చూసి ట్రోల్స్…చూసుకోవాలి కదా గురూజీ.!

 

 


End of Article

You may also like