Ads
హుజురాబాద్ మండలంలోని, జూపాకలో, సమ్మక్క-సారలమ్మ జాతర ఎంతో ఘనంగా జరిగింది. లక్షల మంది భక్తులు సమ్మక్క-సారలమ్మ దర్శనం కోసం, వారి దీవెనల కోసం తరలివచ్చారు. ఫిబ్రవరి 21 నుండి ఫిబ్రవరి 24 వరకు ఈ జాతర జరిగింది. ప్రతి ఏడు లాగానే ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా ఈ వేడుకని నిర్వహించారు.
Video Advertisement
రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈసారి ఇంకా ఘనంగా వేడుకని నిర్వహించి, దర్శనం కోసం వచ్చిన భక్తులకి అన్ని వసతులని కల్పించడానికి ఎంతో కృషి చేశారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా సమ్మక్క సారలమ్మ జాతరకి వెళ్లి దేవతలని దర్శించుకున్నారు. వారి దీవెనలు అందుకున్నారు.
అయితే ఈసారి సమ్మక్క-సారలమ్మ జాతర ఆదాయం శుక్రవారం జిపి ఆఫీస్ లో లెక్కించారు. ఇందులో ఆదాయం ఎంత వచ్చిందో, కానుకలు ఎన్ని వచ్చాయో అనేది లెక్క పెట్టారు. దేవాదాయశాఖ ఈవో సుధాకర్, జాతర కమిటీ చైర్మన్ సదానందం, సమ్మక్క-సారలమ్మ జాతర ఆదాయం 5,53,855 రూపాయలు వచ్చినట్టు తెలిపారు. ఇందులో టికెట్ల ద్వారా 71 వేల రూపాయలు వచ్చాయి. వేలం ద్వారా 72 వేల రూపాయలు వచ్చాయి. హుండీ ద్వారా 4 లక్షల 855 రూపాయలు వచ్చాయి. ఇదే విషయాన్ని అధికారిక బృందం తెలిపారు. ఇతర కానుకలను కూడా భక్తులు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ అధికారులు, మాజీ చైర్మన్లు అయిన రాజిరెడ్డి, నిరంజన్ రెడ్డి, ఇతర డైరెక్టర్లు కూడా పాల్గొన్నారు.
ALSO READ : ఆ మహానుభావుడి గుర్తుగానే రామేశ్వరం కేఫ్ కి ఈ పేరు పెట్టారా..? ఏంటి ఈ కేఫ్ యొక్క ప్రత్యేకత..?
End of Article