ఆ మహానుభావుడి గుర్తుగానే రామేశ్వరం కేఫ్ కి ఈ పేరు పెట్టారా..? ఏంటి ఈ కేఫ్ యొక్క ప్రత్యేకత..?

ఆ మహానుభావుడి గుర్తుగానే రామేశ్వరం కేఫ్ కి ఈ పేరు పెట్టారా..? ఏంటి ఈ కేఫ్ యొక్క ప్రత్యేకత..?

by Harika

Ads

ప్రతి ప్రాంతంలో కొన్ని ప్రదేశాలు చాలా ఫేమస్ గా ఉంటాయి. అక్కడికి వెళ్తే కచ్చితంగా ప్రదేశానికి వెళ్ళాలి అని అంటారు. అందులో కొన్ని హోటల్స్ కూడా ఉంటాయి. హైదరాబాద్ లో అలాంటివి చాలానే ఉన్నాయి. బెంగళూరులో కూడా అలా ఉన్న ఒక ప్రదేశం ఉంది. దాని పేరు రామేశ్వరం కేఫ్. బెంగళూరు వెళ్లి, రామేశ్వరం కేఫ్ గురించి అడిగితే ఎవరైనా సరే చెప్తారు.

Video Advertisement

అక్కడ అది అంత ఫేమస్. అందుకే ఇప్పుడు హైదరాబాద్ లో కూడా మరొక బ్రాంచ్ ఓపెన్ చేశారు. అసలు ఎందుకు ఇంత ప్రత్యేకత? అక్కడ ఎలాంటి పదార్థాలు ఉంటాయి? ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. 2021 లో రామేశ్వరం కేఫ్ ఓపెన్ చేశారు. దివ్య రాఘవేంద్రరావు అనే వ్యక్తికి ఈ ఆలోచన వచ్చింది. ఇక్కడ సౌత్ ఇండియన్ వెజిటేరియన్ వంటలు, కాఫీ, టీ దొరుకుతాయి.

reason behind rameshwaram cafe name

మొదటి బ్రాంచ్ బెంగళూరులో ఓపెన్ చేశారు. రామేశ్వరం కేఫ్ కి ఆ పేరు పెట్టడం వెనుక కూడా ఒక కథ ఉంది. ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఒక గొప్ప వ్యక్తి అక్కడ పుట్టారు. ఆయన గొప్పదనానికి నిదర్శనం గానే ఆ పేరు పెట్టారు. ఆ వ్యక్తి ఎవరో ఈపాటికి మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది. ఏపీజే అబ్దుల్ కలాం గారు రామేశ్వరంలో పుట్టారు. అందుకే ఈ కేఫ్ కి ఆయన పేరు పెట్టారు. దివ్య రాఘవేంద్రరావు ముందు, “ఈ వ్యాపారం చేస్తాను” అని తన ఇంట్లో వారికి చెప్తే ఎవరూ ప్రోత్సహించలేదు. “అంత చదువుకొని ఈ వ్యాపారం చేయడం ఏంటి?” అని అన్నారు. కానీ దివ్య ఎవరి ప్రోత్సాహం సహకారం లేకుండానే తన సొంత కాళ్ళ మీద తను నిలబడి చూపించారు.

abdul kalam about why he did not get married

ఎంతో మంది ప్రముఖులు కూడా బెంగళూరుకి వెళ్ళినప్పుడు రామేశ్వరం కేఫ్ కి కచ్చితంగా వెళ్తారు. ఎన్నో అవార్డులు కూడా వీరు అందుకున్నారు. ఇక్కడ నాణ్యత పరిమాణాలు కూడా ఉన్నతమైన స్థాయిలో ఉంటాయి. అంతగా ప్రాచుర్యాలు పొందడంతో, వారి సేవలను వివిధ ప్రాంతాలకు విస్తరిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో కూడా వీరి బ్రాంచ్ ఓపెన్ చేశారు. ఇక్కడ కూడా ఎంతో మంది రామేశ్వరం కేఫ్ లో పదార్థాలు రుచి చూడడానికి వెళుతున్నారు. భవిష్యత్తులో ఇంకా చాలా చోట్ల వీళ్ళకి బ్రాంచెస్ ఓపెన్ చేసి ఆలోచన కూడా ఉంది అన్నట్టు ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఇలాగే విస్తరించి, ఇంకా గొప్ప పేరు పొందాలి అని ఆశిద్దాం.

ALSO READ : వైయస్ షర్మిల “ప్రేమ కథ” తెలుసా..? వీరి పరిచయం ఎలా మొదలయ్యింది అంటే..?


End of Article

You may also like