వైయస్ షర్మిల “ప్రేమ కథ” తెలుసా..? వీరి పరిచయం ఎలా మొదలయ్యింది అంటే..?

వైయస్ షర్మిల “ప్రేమ కథ” తెలుసా..? వీరి పరిచయం ఎలా మొదలయ్యింది అంటే..?

by Mounika Singaluri

Ads

వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా వైఎస్ షర్మిల అందరికీ పరిచయమే. వైయస్ జగన్మోహన్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ అంతా పాదయాత్ర చేసిన షర్మిల రాజకీయాల్లో కూడా తన ప్రస్తానాన్ని చాటుకున్నారు. తర్వాత జరిగిన పరిణామాలలో తెలంగాణ వచ్చి వైయస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించారు.

Video Advertisement

వైయస్సార్ ఆశయాలను సాధించే దిశగా తెలంగాణలో పాలన అందిస్తానంటూ పాదయాత్రలు కూడా చేశారు. అయితే తాజాగా 2023 ఎన్నికల్లో పోటీ చేయట్లేదు అని సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి తన మద్దతు ఉంటుందని ప్రకటించారు.

అయితే రాజకీయంగా వైఎస్ షర్మిల అందరికీ తెలిసిన కూడా తన వ్యక్తిగత జీవితం గురించి చాలా కొద్ది మందికే తెలుసు. వైయస్ షర్మిల బ్రదర్ అనిల్ కుమార్ ని వివాహం చేసుకున్నారు. వీరి పరిచయం ఎలా జరిగింది? వీరీ ప్రేమ కథ ఎలా మొదలైంది? అని వైఎస్ షర్మిల ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు.వైయస్ షర్మిల బ్రదర్ అనిల్ కుమార్ ని మొదటిసారి హైదరాబాదులోని ఒక దాబాలో కలిశారట. చదువుకునే సమయంలో స్నేహితులందరూ కలిసి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు బ్రదర్ అనిల్ కుమార్ కూడా ఆ మీటింగ్ కి వచ్చారంట. అప్పటినుండి అడపాదడపా కలుస్తూ వచ్చేవారు.

అయితే ఇద్దరిలో బ్రదర్ అనిల్ కుమార్ మొదటిసారిగా షర్మిల కి ప్రపోజ్ చేశారట.అయితే క్రైస్తవ మతంలోకి మారక ముందు బ్రదర్ అనిల్ కుమార్ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి.వీరి పెళ్లికి వైయస్ రాజశేఖర్ రెడ్డి మొదట ఒప్పుకోలేదట. వారు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు వారితో కలిసి ఉండలేవంటు షర్మిలకి నచ్చ చెప్పారట.ఇప్పుడు బాగానే ఉంటుంది తర్వాత ఉండలేవు అని అనేవారట. వారి ఆహారపు అలవాట్లు వేరు తన ఆహార అలవాట్లు వేరని చెప్పారట.

షర్మిల చికెన్ లేకపోతే భోజనం కూడా తినేదాన్ని కాదు అని చెప్పుకొచ్చారు. అయినా సరే తాను ఉండగలనని నమ్మి తన పట్టుదలతో బ్రదర్ అనిల్ ని పెళ్లి చేసుకున్నట్లుగా చెప్పుకొచ్చారు.బ్రదర్ అనిల్ కూడా నాన్ వెజ్ తినడం వల్ల తమకి ఎటువంటి ఇబ్బంది లేకుండా లేదని అలా హ్యాపీగా లైఫ్ కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. తన రాజకీయాలకు తను పూర్తిగా మద్దతు ఇస్తారని అన్నారు. వీరికి సంతానంగా ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు.

Also Read:ప్రపంచ కప్ నుండి హార్దిక్ పాండ్యా అవుట్..! ఈ ప్లేయర్ ని తీసుకున్నారా..?


End of Article

You may also like