తన భార్య కోసం “సంపూర్ణేష్ బాబు” ఏ అవతారం ఎత్తారో చూస్తే హ్యాట్సాఫ్ అంటారు!

తన భార్య కోసం “సంపూర్ణేష్ బాబు” ఏ అవతారం ఎత్తారో చూస్తే హ్యాట్సాఫ్ అంటారు!

by Anudeep

Ads

హృదయం కాలేయం సినిమా తో సినీ ప్రస్థానం మొదలు పెట్టిన హీరో బర్నింగ్ స్టార్ ‘సంపూర్ణేష్ బాబు’ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు ‘హృదయం కాలేయం’ తో మొదలు పెట్టి , బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులారిటీని సంపాదించుకున్నారు . ఇటీవలే కొబ్బరి మట్ట సినిమాతో తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గర అయ్యారు.. ఇక అసలు విషయానికి వస్తే..

Video Advertisement

కరోనా పై కట్టడి చేసిన లాక్ డౌన్ కారణంగా యావత్ భారతావని ఇంటికే పరిమితం అయిన సంగతి తెలిసిందే.. ప్రముఖ సినీ హీరోలు,హీరోయిన్లు తమ తమ కుటుంబంతో గడుపుతూ అందుకు సంబందించిన విశేషాలన్నీ తమ తమ సామాజిక మాధ్యమాలలో పంచుకుంటున్నారు.మన బర్నింగ్ స్టార్ మాత్రం తనదైన శైలి లో స్పందించారు..తన పాత జ్ఞాపకాలలోకి వెళ్లి మరి గుర్తు చేసుకున్నారు తన కాంశాలి వృత్తిని నెమరేసుకుంటూ…. అలాగే ఇంట్లో మిగిలి పోయిన గజ్జెలతో తన భార్య, పిల్లల కోసం.. మెట్టెలు, గజ్జెలు స్వయంగా ఆయన చేతులతో తయారు చేశారు. తనదైన శైలిలో ‘బి ది రియల్‌ మ్యాన్’‌ చాలెంజ్‌ను పూర్తి చేశాడు.

Image Credits : Sampoornesh Babu Facebook Page

దీనికి సంబందించిన ఒక వీడియో ను సైతం సంపూర్ణేష్ బాబు తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు ‘రాజు పేద తేడా లేదు. నీ ఆస్తి, డబ్బు.. నీ వెనక రావు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మర్చిపోవద్దు, గుర్తుచేసుకుంటున్న సమయం ఇది. మా ఆవిడ కోసం, పిల్లల కోసం నా పాత “కంశాలి”వృత్తి ని గుర్తు చేసుకుంటూ ఇంట్లో మిగిలిన గజ్జెలతో, తనకి కాలి మెట్టెలు, పిల్లల కోసం గజ్జెలు చేయించి ఇచ్చాను’ అంటూ చెప్పుకొచ్చారు లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న సినీకార్మికుల కోసం ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీకి సంపూ అక్షరాలా లక్ష రూపాయల విరాళాన్ని అందచేశారు..

https://twitter.com/sampoornesh/status/1253356374253174784


End of Article

You may also like