Ads
కేరళ కుట్టి సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 2016లో ‘పాపకార్న్’ అనే మలయాళ సినిమాతో హీరోయిన్ గా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ భామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైంది. ఈ చిత్రంలో రానాకు జోడిగా నటించి మెప్పించింది. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ బింబిసారలోను నటించి అదరగొట్టింది. ఇప్పుడు ధనుష్ హీరోగా నటిస్తున్న ‘సార్’ సినిమాలో కూడా టీచర్ పాత్రలో అలరించడానికి సిద్ధం అయ్యింది ఈ ముద్దుగుమ్మ.
Video Advertisement
తాజాగా తన పేరులోని చివరి పదాన్ని తీసేసినట్లు తానే స్వయంగా వెల్లడించింది. భీమ్లా నాయక్ సినిమా టైటిల్స్ లో సంయుక్త మీనన్ అని తన పేరును వేశారు. కానీ ఇప్పుడు ధనుష్ సార్ సినిమా సమయంలో కేవలం సంయుక్త అని మాత్రమే ఆమె పేరు వేయించుకోవడంతో అందరి ద్రుష్టి ఆమె పై పడింది. దీంతో ఇటీవల సార్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సంయుక్త మీనన్ నుంచి సంయుక్త గా మారడానికి గల కారణాలను ఆమె వెల్లడించింది.
” నా పేరు లో నుంచి మీనన్ తీసేయాలని ఆలోచన చాలా రోజుల క్రితమే నాకు కలిగింది. పేరు చివర తోకలు ఎందుకు తగిలించుకుంటారు అనేది నాకు అర్థం కాదు.. నటి అయ్యాక ఈ ఆలోచన నాలో మరింత పెరిగింది. చిన్నప్పుడు స్కూల్ లో రాసిన పేరు నే ఇప్పటికీ కొనసాగిస్తూ వచ్చాను. మన చుట్టూ సమానత్వం, మానవత్వం, ప్రేమ చూడాలనుకున్నప్పుడు ఇంటిపేరును ఉంచుకోవడం అనేది నేను కోరుకుంటున్నవాటికి విరుద్ధంగా ఉంటుంది. అంతే కాకుండా చాలా కాలం క్రితమే నా తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. మా నాన్న ఇంటి పేరును కొనసాగించడం అమ్మకు ఇష్టంలేదు. నా తల్లి భావాలను గౌరవించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాను. ఇకపై నా సోషల్ మీడియా, నేను నటించే సినిమాలలోనూ సంయుక్త గానే ఉంటుంది.” అని సంయుక్త తెలిపారు.
నా కెరీర్ మొదలైన నాటి నుంచి విభిన్నమైన పాత్రలు చేస్తున్నా.. ఇప్పుడు సార్ చిత్రంలోనూ నా పాత్ర అందర్నీ అలరిస్తుంది అని సంయుక్త తెలిపింది. తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్ టైం మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 17 వ తేదీన ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
End of Article