Ads
ఇటీవల ముఖంపై సెలెబ్రిటీలు చేయించుకునే సర్జరీలు ఒక్కోసారి వికటించడం.. వారి రూపం గుర్తుపట్టలేని విధంగా మారిపోవడం చూస్తూనే ఉన్నాం. కానీ.. దంత సమస్యల కారణంగా రూపు రేఖలు మారిపోయిన సంఘటన ఎప్పుడైనా చూశామా? ప్రస్తుతం దంత వైద్యంలో టెక్నాలజీ బాగానే అభివృద్ధి చెందింది. కానీ.. హీరోయిన్ స్వాతి మాత్రం దంత చికిత్స నిమిత్తం వెళ్లి.. తన రూపు రేఖల్ని కోల్పోవాల్సి వచ్చింది.
Video Advertisement
వివరాల్లోకి వెళ్తే.. శాండల్ వుడ్ కు చెందిన స్వాతి సతీష్ అనే హీరోయిన్ ఈ సమస్యని ఎదుర్కొంటోంది. సాధారణంగా లైపో సెక్షన్, ప్లాస్టిక్ సర్జరీ వంటివి రిస్క్ తో కూడుకున్నవి. వికటించి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
కానీ, టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందిన దంత వైద్యంలో కూడా సర్జరీ వికటించిన సంఘటన చోటు చేసుకుంది. శాండల్ వుడ్ కు చెందిన హీరోయిన్ స్వాతి ఇటీవల పంటి సమస్య కారణంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే.. ఆమె దంత వైద్యుడిని సంప్రదించగా.. రూట్ కెనాల్ ట్రీట్ మెంట్ చేయాలని సూచించారు. అందుకు సిద్దమైన స్వాతి రూట్ కెనాల్ ట్రీట్ మెంట్ ను తీసుకున్నారు. అయితే.. సర్జరీ తరువాత ఆమె మూతి బాగా వాచి ఉబ్బిపోయింది.
అయితే ఆమె సదరు వైద్యుడిని సంప్రదించగా.. ఇది సహజమేనని.. మూడు రోజుల్లో తగ్గిపోతుందని చెప్పి పంపించారు. కానీ, మూడు వారాలు అయినా ఆమె వాపు తగ్గకపోవడంతో మరో వైద్యుడిని సంప్రదించారు. సర్జరీ సమయంలో అనస్థిషియా బదులుగా సాలిసిలిక్ యాసిడ్ ను ఇవ్వడం వలన ఇలా జరిగిందని తేలింది. ఇప్పుడు ఏమి చెయ్యాలో తెలియక స్వాతి సతమతమవుతున్నారు. తన రూపు రేఖలు మారిపోయాయని.. ఎవరూ గుర్తుపట్టడం లేదనీ బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె చికిత్స తీసుకుంటున్నారు. తాను కోలుకున్న తరువాత తనకి తప్పుడు చికిత్స ఇచ్చిన డాక్టర్ పై కేసు పెడతానని చెప్పారు.
End of Article