Ads
యానిమల్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్టును నమోదు చేశారు తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. రణబీర్ కపూర్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ గా నిలచింది.
Video Advertisement
అయితే ఈ సినిమా పైన చాలామంది క్రిటిక్స్ నెగిటివ్ రివ్యూలు రాశారు. చాలామంది విశ్లేషకులకు యానిమల్ సినిమా నచ్చలేదు. వైలెన్స్ ఎక్కువగా ఉంది అంటూ చెబుతున్నారు.
అయితే తన సినిమాకి పేరు పెట్టిన ప్రతి ఒక్కరిని సందీప్ రెడ్డి వంగా ఒక ఆట ఆడుకున్నారు. వాళ్ళందర్నీ జోకర్స్ అంటూ సంబోధిస్తూ కామెంట్లు చేశారు. ఇప్పుడు ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే సందీప్ మాట్లాడుతూ .. యానిమల్ సినిమాకే ఇలా ఉంటే రేపు నేను తీయబోయే యానిమల్ పార్క్, స్పిరిట్ సినిమాలకి చచ్చిపోతారేమో అంటూ వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడారు. యానిమల్ సినిమాకి సీక్వల్గా యానిమల్ పార్క్ మూవీ అనౌన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. యానిమల్ సినిమా ఎండ్ క్రెడిట్స్ అప్పుడు వచ్చిన వైలెన్స్ అయితే బీభత్సంగా ఉంది.
దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది రాబోయే సినిమాలో సందీప్ ఏ రేంజ్ లో వైలెన్స్ చూపించబోతున్నారు అని
End of Article