ఒకపక్క జనం చస్తుంటే…ఆ వీడియోలు పోస్ట్ చేస్తారా? వారిపై సానియా మీర్జా ఫైర్.!

ఒకపక్క జనం చస్తుంటే…ఆ వీడియోలు పోస్ట్ చేస్తారా? వారిపై సానియా మీర్జా ఫైర్.!

by Anudeep

Ads

సెలబ్రిటీస్ పై మండి పడుతూ ట్వీట్ చేసింది సానియా మీర్జా.. హఠాత్తుగా ఈమెకి సినిమా వాళ్లపైన ఎందుకు కోపం వచ్చింది చెప్మా? అనుకుంటున్నారా కాని, సానియా కోపంలో కూడా అర్దం లేకపోలేదు . ఎప్పుడూ బిజిగా వుండే మన సెలబ్స్ ఇప్పుడు తము చేసిన పనులు,   వండిన వంటకాలని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నరు..ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ట్విటర్ వేదిక గా మండి పడింది సానియా.

Video Advertisement

 

లాక్ డౌన్ నేపధ్యంలో అందరూ ఎవరిళ్లకు వాళ్లు పరిమితమయ్యారనే విషయం తెలిసిందే కదా..  సామాన్యుడి నుండి సెలబ్రిటి వరకు గడప దాటి బయటికి రాని పరిస్థితి.. దీంతో ఎఫ్పుడూ బిజి షెడ్యూల్లో ఉండే మన సెలబ్రిటీలకు ఫ్యామిలీస్తో  గడిపే సమయం దొరికింది. దాంతో కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నారు.  చాలా వరకు పని వాళ్లని, వంట వాళ్లని మానిపించేసి ఎవరిపని వారే చేసుకుంటున్నారు. ఆ వంటలని చాలా గొప్పగా సోషల్ మీడియల్లో అప్లోడ్ చేస్తున్నారు.

కాని నాణెనికి మరోవైపు చూస్కుంటే , లాక్ డౌన్ అందరి జీవితాల్లోనూ వెలుగులు నింపదు..పూట గడవని వారికి,రోజు కూలికి పని చేసేవారికి , చిన్నచిన్న వ్యాపారాలు చేస్కునే వారికి ఇది చాలా గడ్డుకాలమనే చెప్పాలి.. దాంతోపాటు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియక మార్కెట్లో ఉన్న సరుకులు చాలా వరకు ఇప్పటికే కొద్దొ గొప్పో స్థోమత ఉన్నవాళ్ల ఇళ్లకి చేరిపోయి సరుకుల కొరత కూడ ఏర్పడింది. వలసకూలిల పరిస్థితి అయితే ఇంకా ఘోరం సొంత ఊళ్లకు వెళ్లలేక , ఉన్న ఊళ్లో పనులు లేక నానారకాల తిప్పలు పడుతున్నారు.

ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఫూడ్ వీడియోస్, ఫోటోస్ అప్లోడ్ చేయడం ఇంకా పూర్తి కాలేదా? మన చుట్టూ వేలాది మంది కరోనా మహమ్మారితో బాధపడుతూ మృత్యువాత పడుతుంటే, లక్షలాది మంది ఒక్క పూట భోజనం లేకుండా అల్లాడిపోతున్నారు.ఒక్క పూట భోజనం దొరకడం అదృష్టంగా భావిస్తున్నారు. అలాంటప్పుడు ఇలాంటి వీడియోలు అప్లోడ్ చేయకుండా ఉండలేమా అంటూ ట్వీట్ చేశారు.

ఆపద సమయంలో ఎగ్జిబిషన్ ఆఫ్ ఫూడ్ అనేది నేరం..అంతేకాదు ఒకటి కంటే ఎక్కువ పదార్దాలు వండుకుని తినడం తప్పు. కాబట్టి వీలైనంత తక్కువగా ఫూడ్ ప్రిపేర్ చేయండి,వాటిని ఎగ్జిబిషన్ పెట్టకండి సోషల్ మీడియాలో..వీలైనంత ఎక్కువమందికి సాయం చేయడానికి చూడండి..ఇలాంటప్పుడే మనిషిలోని మనిషితనం బయటపడేది.

 


End of Article

You may also like